కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతూ ఉండగా ఈ ఇయర్ ఆల్ రెడీ వారిసు(Varisu) సినిమాతో యావరేజ్ రివ్యూలతో కూడా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా…
ఇప్పుడు తన కెరీర్ లోనే రీసెంట్ టైంలో ఏ సినిమాకి లేనంత హైప్ తో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న సినిమా లియో(Leo Movie) తో రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా నుండి ఇప్పటి వరకు ఒక్క టీసర్ కూడా…
రిలీజ్ చేయలేదు అయినా కూడా సినిమా మీద హైప్ మరో లెవల్ లో ఉంది. కాగా సినిమా కి ఉన్న హైప్ దృశ్యా భారీ లెవల్ లో బిజినెస్ అన్ని చోట్లా జరుగుతూ ఉండగా తమిళనాడులో ఈ సినిమా బిజినెస్ ఆఫర్స్ అందరినీ ఓ రేంజ్ లో మైండ్ బ్లాంక్ చేసింది.
సినిమా కి తమిళనాడులో ఇప్పుడు ఆల్ మోస్ట్ 100 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు టాక్ గట్టిగా వినిపిస్తూ ఉండగా సినిమా తమిళ్ లో ఇప్పుడు హిట్ అవ్వాలి అంటే ఆల్ మోస్ట్ 190 కోట్ల రేంజ్ నుండి 200 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం…
ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావాలి అంటే సినిమాకి అద్బుతమైన టాక్ రావాలి. సినిమా కి ఉన్న హైప్ కి టాక్ ఏమాత్రం పాజిటివ్ గా వచ్చినా రికార్డ్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉంది. మరి సినిమా ఎంతవరకు ఈ అంచనాలను అందుకుంటుందో చూడాలి ఇక…