Home గాసిప్స్ చంద్రముఖి2 బడ్జెట్ ఎన్ని కోట్లు…నిర్మాతకి లాభమా నష్టమా!

చంద్రముఖి2 బడ్జెట్ ఎన్ని కోట్లు…నిర్మాతకి లాభమా నష్టమా!

0

రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన రాఘవ లారెన్స్(Raghava Lawrence) నటించిన లేటెస్ట్ మూవీ చంద్రముఖి2(Chandramuki2 Movie) సినిమా 2005 టైంలో వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన చంద్రముఖి(Chandramukhi) సినిమాకి…

సీక్వెల్ గా ఆడియన్స్ ముందుకు రాగా సినిమాలో కొన్ని సీన్స్ బాగున్నా కూడా ఓవరాల్ గా సినిమా మాత్రం ఒరిజినల్ తో పోల్చితే పేరడీ వర్షన్ గానే ఉందని ఆడియన్స్ నుండి టాక్ ను సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా నిరాశ పరిచే రన్ ని కొనసాగిస్తూ ఉండగా…

సినిమా ను ఓవరాల్ గా ఎంత ఖర్చు పెట్టి నిర్మించారు అన్నది ఆసక్తిగా మారగా కోలివుడ్ ట్రేడ్ టాక్ ప్రకారం సినిమా ఓవరాల్ గా 50 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో తెరకెక్కింది అని సమాచారం. కాగా సినిమా థియేట్రికల్ బిజినెస్ ఓవరాల్ గా 30 కోట్ల దాకా జరగగా…

ఓన్ రిలీజ్ కూడా కలిపి 42 కోట్ల దాకా జరగగా ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ తో కలిపి సినిమా కి 35 కోట్ల దాకా బిజినెస్ జరిగింది అని సమాచారం. దాంతో ఓన్ రిలీజ్ ను పక్కకు పెడితే ఓవరాల్ గా సినిమాకి 65 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది అని చెప్పొచ్చు..

దాంతో 50 కోట్ల బడ్జెట్ మీద పబ్లిసిటీ ఖర్చులు 4 కోట్ల దాకా జరిగాయి అనుకున్నా ఓవరాల్ బడ్జెట్ మీద 10 కోట్లకు పైగానే లాభం నిర్మాతకి సొంతం అయ్యింది అంటున్నారు… కానీ కొన్న బయ్యర్లు, వాల్యూ బిజినెస్ ను కలిపి సినిమా ఇంకా సగం వరకు టార్గెట్ ను అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here