బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా మీద మంచి అంచనాలు ఉండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మూడు రోజుల ముందే మొదలు అయినా కూడా అనుకున్న రేంజ్ లో ప్రీ బుకింగ్స్ సినిమా కి ఏమి సొంతం అవ్వలేదు…
రవితేజ సినిమాలు అంటే ఆఫ్ లైన్ లో కౌంటర్ దగ్గర టికెట్ సేల్స్ బాగా జరుగుతాయి, అది చాలా సినిమాలకు రుజువు అవ్వగా ఇప్పుడు బుకింగ్స్ కొంచం వీక్ గా ఉన్నా కూడా టైగర్ నాగేశ్వరరావు సినిమా రిలీజ్ రోజుకి వచ్చే సరికి మాత్రం ఆఫ్ లైన్ కౌంటర్ దగ్గర టికెట్ సేల్స్ హెల్ప్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది.
షో షోకి కలెక్షన్స్ లో మంచి ట్రెండ్ కనిపిస్తూ ఉండటంతో తొలిరోజు ఓపెనింగ్స్ అదిరిపోయే విధంగా సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రజెంట్ ఓపెనింగ్స్ ను బట్టి చూస్తూ ఉంటే….
4.5 కోట్ల రేంజ్ నుండి 5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక అంచనాలను మించిపోతే ఈ కలెక్షన్స్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…
ఓవరాల్ గా మరోసారి మాస్ సెంటర్స్ లో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో రవితేజ తన బ్రాండ్ ను చూపెడుతూ దూసుకు పోతున్నాడు, ఇక డే ఎండ్ అయ్యే టైం కి సినిమా ఇదే రేంజ్ లో ఫ్లో ని కొనసాగించి ఈ లెక్కను కూడా మించి పోయే విధంగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి ఇప్పుడు.