బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఓవరాల్ గా మొదటి రోజు మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకోగా రెండో రోజులో అడుగు పెట్టిన సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర….
మరోసారి పర్వాలేదు అనిపించేలా జోరుని చూపిస్తుంది కానీ అది అనుకున్న రేంజ్ లో అయితే లేదని చెప్పాలి. సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా మొదటి రోజుకి ఏమాత్రం తీసిపోని విధంగా సినిమా కంటిన్యూగా దసరా సెలవుల్లో చూపించాల్సిన అవసరం ఉండగా… రెండో రోజు సినిమా ఇప్పుడు…
తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా మొదటి రోజుతో పోల్చితే ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో 25% రేంజ్ దాకా డ్రాప్స్ ఉండగా మరోసారి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ మేజర్ రోల్ ప్లే చేయబోతుండగా ట్రాక్ చేసిన సెంటర్స్ లో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పర్వాలేదు అనిపించే విధంగా ఉండటంతో ఈ రోజు సినిమా…
తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 3.2 కోట్ల రేంజ్ నుండి 3.50 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా 4 కోట్లకు అటూ ఇటూగా షేర్ ని అందుకోవచ్చు. మరి సినిమా అన్ని చోట్లా అంచనాలను మించిపోయి ఈ అంచనాలను మించి వసూళ్ళని సాధిస్తుందో లేదో చూడాలి.