నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) బాక్ టు బాక్ హిట్స్ తో హాట్రిక్ ను పూర్తి చేసుకోగా బాలయ్యకి సాలిడ్ కంబ్యాక్ మూవీగా నిలిచిన మొదటి సినిమా అఖండ(Akhanda) ఏ రేంజ్ లో రచ్చ చేసి బాలయ్యకి మాస్ కంబ్యాక్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. అలాంటి ఈ సినిమా రిలీజ్ టైంలోనే ఇతర భాషల్లో మంచి డిమాండ్ ఏర్పడింది…
రిలీజ్ టైంలోనే ఇతర భాషల్లో సినిమాను డబ్ చేసి రిలీజ్ చేయాలి అనుకున్నా ఆలస్యం అవ్వగా తర్వాత డిజిటల్ లో డబ్ వర్షన్ లు రిలీజ్ అయినా కూడా బాలీవుడ్ లో ఈ సినిమా రీమేక్ పై మంచి జోరు కొనసాగగా ఇప్పుడు సినిమా రీమేక్ కి సిద్ధం అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు….
నార్త్ సైడ్ ఇలాంటి హిందూ యిజాన్ని హైలెట్ చేసే సీన్స్ కానీ, దేవాలయాలు దేవుళ్ళని గొప్పగా చూపించే సీన్స్ కానీ…. హీరోలను మాస్ గాడ్స్ గా చూపించే సన్నివేశాలను విరగబడి చూస్తారు. ఇలాంటివి అన్నీ అఖండలో ఉండటంతో అక్కడ సినిమా రీమేక్ లో నటించే అవకాశం 2 హీరోలకు ఎక్కువగా ఉందని అంటున్నారు…
రేసులో అజయ్ దేవగన్ మరియు అక్షయ్ కుమార్ లు ముందు వరుసలో ఉన్నారని, బాలయ్య అఖండ రోల్ కి వీళ్ళు మాత్రమే న్యాయం చేయగలరని ఈ ఇద్దరు హీరోలలో ఒకరు ఫైనల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రీసెంట్ టైంలో రీమేక్ లు పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు కానీ అఖండ లో కంటెంట్ అలాగే నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే స్టోరీ ఉండటంతో అక్కడ కొంచం మార్పులతో తీస్తే వర్కౌట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పొచ్చు….