బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) నటించిన లేటెస్ట్ మూవీ టైగర్3(Tiger 3 Movie) భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు దీపావళి కానుకగా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్ లో టాక్ ను అయితే సొంతం చేసుకుంది అని చెప్పాలి.
కానీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ముందే మొదలు అయినా కూడా టైగర్ సిరీస్ అలాగే రీసెంట్ పఠాన్(Pathaan) జవాన్(Jawan Movie) సినిమాలతో పోల్చితే బుకింగ్స్ కొంచం వీక్ గానే ఉన్నాయి. అలాగే ప్రీ దీపావళి ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి అవన్నీ పరిగణలోకి తీసుకుంటే సినిమా ఉన్నంతలో….
మొదటి రోజుకి గాను ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో 26 కోట్ల దాకా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే అన్ని భాషల మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్స్ రేంజ్ 38 కోట్ల రేంజ్ నుండి 40 కోట్ల రేంజ్ దాకా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు…
కానీ సినిమా రేంజ్ కి ప్రీవియస్ మూవీస్ హైప్ దృశ్యా సినిమా 45-50 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకోవాల్సిన అవసరం ఉంది… మొత్తం మీద దీపావళి హాలిడేస్ లో సినిమా మంచి జోరునే చూపించే అవకాశం ఉంది. ఇక మొదటి రోజుకి గాను సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.