బాలీవుడ్ సూపర్ స్టార్ సాల్మన్ ఖాన్(Salman Khan) నటించిన లేటెస్ట్ మూవీ టైగర్3(Tiger3 Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మీద ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉండగా సినిమా దీపావళి కానుకగా రిలీజ్ అయ్యి ఆ అంచనాలను పూర్తిగా అందుకోలేక పోయింది. ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా ఉన్న సినిమా…
దీపావళి హాలిడేస్ లో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకోగా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయ్యింది. దాంతో టైగర్ సిరీస్ లో, పఠాన్, వార్ మూవీస్ తో పోల్చితే సినిమా కలెక్షన్స్ జోరు చాలా తక్కువగానే ఉందని చెప్పాలి ఇప్పుడు…. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద…
5 వ రోజున 18.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా టోటల్ గా 5 రోజుల ఇండియా నెట్ కలెక్షన్స్ లెక్క 187 కోట్లకు పైగా ఉండగా టోటల్ ఇండియా గ్రాస్ లెక్క 225 కోట్ల లోపు ఉండగా ఓవర్సీస్ లో సినిమా ఇప్పటి వరకు 73 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా…
టోటల్ గా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 298 కోట్లకు పైగా ఉందని చెప్పాలి ఇప్పుడు…ఓవరాల్ గా ఇవి డీసెంట్ కలెక్షన్స్ అయినా కూడా ఈ ఫ్రాంచేజ్ లో వచ్చిన ఇతర సినిమాలతో పోల్చితే మాత్రం ఈ కలెక్షన్స్ చాలా తక్కువే అని చెప్పాలి. క్రికెట్ మ్యాచులు కూడా ఇంపాక్ట్ చూపెడుతూ ఉండగా…
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో రెట్టించిన జోరు చూపించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. మరి సినిమా ఈ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ తో గ్రోత్ ని చూపిస్తుందో చూడాలి ఇప్పుడు.