బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల సాలిడ్ లాంగ్ ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో దుమ్ము లేపిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(salaar part 1 – ceasefire) సినిమా 5వ రోజు వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అవ్వగా సినిమా మార్నింగ్ షోలకు కొంచం హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా….
తిరిగి సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు మంచి ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతుంది, వర్కింగ్ డే లో కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కూడా సినిమాకి పడగా ఓవరాల్ గా సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 5వ రోజున అటూ ఇటూగా 7-8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది.
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉండగా సినిమా హిందీలో ఈ రోజు మంచి ట్రెండ్ నే చూపెడుతూ 7-8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ దిశగా దూసుకు పోతూ ఉండగా కర్ణాటక, తమిళ్ మరియు కేరళలో డ్రాప్స్ కొంచం ఎక్కువగానే ఉండగా ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపించేలా…
హోల్డ్ చేస్తున్న సినిమా వరల్డ్ వైడ్ గా ఈ రోజు ఓవరాల్ గా 14-15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక అంచనాలను అందుకుని మించిపోతే సినిమా షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది….
ఓవరాల్ గా వర్కింగ్ డే లో సలార్ మూవీ మంచి హోల్డ్ నే ఈ రోజు చూపిస్తూ ఉండటంతో లాంగ్ రన్ ని సొంతం చేసుకునే ఆవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 5 రోజుల్లో సాధించే అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి ఇక…