Home న్యూస్ వర్కింగ్ డే లో హౌస్ ఫుల్స్….సలార్ రాంపేజ్!

వర్కింగ్ డే లో హౌస్ ఫుల్స్….సలార్ రాంపేజ్!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల హాలిడే ఎక్స్ టెండెడ్ వీకెండ్ ను కంప్లీట్ చేసుకున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(salaar part 1 – ceasefire) ఇప్పుడు 5వ రోజు నుండి వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయింది. కాగా వర్కింగ్ డే లో మిగిలిన అన్ని సినిమాల మాదిరిగానే…

ఈ సినిమా కూడా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, కానీ సినిమా తిరిగి మ్యాట్నీ షోల నుండి పుంజుకుని అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ దూసుకు పోతుంది. చాలా వరకు పెద్ద సినిమాలు అయినా కూడా వర్కింగ్ డే కి వచ్చే సరికి డ్రాప్స్ తో సగం థియేటర్స్ ఫుల్ అయితే చాలా గొప్ప విషయమే…

Salaar 3 Days Total WW Collections!

కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజు హిందీ వర్షన్ ముంబై, డిల్లీ, మేజర్ సిటీలలో హౌస్ ఫుల్ బోర్డులు పడటం విశేషం, ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా మేజర్ సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి, ఓవరాల్ గా సినిమా కొన్ని చోట్ల 50% రేంజ్ లో ఆక్యుపెన్సీని కూడా సొంతం చేసుకుంది.

సినిమా కి ఓవరాల్ గా వర్కింగ్ డే లో ఫుల్స్ పడటంతో లాంగ్ రన్ ని కన్ఫాం చేస్తుంది అని చెప్పాలి. ఈ ఫుల్స్ అన్ని చోట్లా జోరు చూపిస్తే ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ ని ఈ వర్కింగ్ డేస్ లో అందుకుంటే వీకెండ్ లో తిరిగి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…ఇక ఈ రోజు వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.

Salaar 2 Days Total WW Collections!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here