టాప్ స్టార్స్ నటించిన సినిమాల టీసర్ లు, ట్రైలర్ లు అలాగే గ్లిమ్స్ లు వస్తున్నాయంటే ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు, ఆ వీడియోలు 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటాయి అన్నది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు అందరు హీరోల ఫ్యాన్స్ కూడా…
ఎవరైనా కొత్త రికార్డులు నమోదు చేస్తే ఇతర హీరోల సినిమాలు ఆ రికార్డులు బ్రేక్ చేస్తున్నాయా లేదా అని ఎదురు చూస్తూ ఉంటారు, రీసెంట్ టైంలో టాలీవుడ్ లో వచ్చిన గ్లిమ్స్ లో మొదటి 1 లక్ష లైక్స్ ని అన్ని సినిమాల కన్నా వేగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ సొంతం చేసుకున్నారు…
పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ(OG – They Call Him OG) సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు కేవలం 6 నిమిషాల టైం తీసుకుని కొత్త ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ రికార్డ్ ను నమోదు చేయగా యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన దేవర(Devara Glimpse) రిలీజ్ అవ్వగా ఈ గ్లిమ్స్ తో కొత్త రికార్డ్ నమోదు అవుతుంది అనుకున్నా అలా జరగలేదు…
ఒకసారి టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ని అందుకున్న గ్లిమ్స్ ను గమనిస్తే…
Tollywood Fastest 100k Liked Glimpse
👉#TheyCallHimOG – 6Min+
👉#DevaraGlimpse – 9Mins
👉#RRRMovie – 12Min
👉#UstaadBhagathSingh – 13Min
👉#BheemlaNayak -17Min
👉#RadheShyam – 23Mins
👉#UstaadBhagatSingh 2nd Glimpse – 39 Mins****
👉#GunturKaaram – 44Mins
మొత్తం మీద పవన్ కళ్యాణ్ పేరిట ఉన్న రికార్డ్ ఇప్పటికీ అలాగే కొనసాగుతూ ఉంది, ఇక ఈ ఇయర్ లో మరిన్ని టాప్ స్టార్స్ అండ్ క్రేజీ సినిమాలు రిలీజ్ లు ఉన్నాయి, మరి ఆ సినిమాల్లో ఏ సినిమాలు ఈ లిస్టులో నిలిచి కొత్త రికార్డులను నమోదు చేయడానికి ట్రై చేస్తాయో చూడాలి ఇక…