బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా టైం అవుతున్న కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు నా సామి రంగ(Naa Saami Ranga Review) తో వచ్చేశాడు… ఆల్ రెడీ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద డీసెంట్ అంచనాలు ఏర్పడ్డాయి. మరి సినిమా ఇప్పుడు ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ….
ముందుగా కథ విషయానికి వస్తే ఊర్లో పెద్దమనిషి అయిన నాజర్ ని ఒక ప్రమాదం నుండి కాపాడతారు చిన్నప్పటి నాగార్జున మరియు అల్లరి నరేష్ లు, దాంతో వాళ్ళని కూడా తన పిల్లలతో సమానంగా చూసుకుంటాడు నాజర్, కానీ ఒక కొడుకుకి నాగార్జున అంటే పడదు.. దాంతో వీళ్ళ మధ్య గొడవ స్టార్ట్ అవ్వగా…. హీరోయిన్ తో లవ్ స్టోరీ ఏంటి…
అల్లరి నరేష్ అంటే నాగార్జునకి ఎందుకంత ఇష్టం, ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన పోరింజు మరియం జోస్ సినిమాకి రీమేక్ గా వచ్చినా తెలుగు నేటివిటీకి తగ్గ మార్పులు బాగానే చేశారు… ఒరిజినల్ చూడని చాలా మందికి నా సామి రంగ…
పక్కా పండగ పెర్ఫెక్ట్ మూవీలా మెప్పించడం ఖాయం, ఫస్టాఫ్ లో లవ్ యాంగిల్ చుట్టూ కథ కొంచం స్లో అయినా ఎంటర్ టైన్ మెంట్ తోనే సాగగా ప్రీ ఇంటర్వెల్ నుండి ఊపు అందుకునే కథ ఇంటర్వెల్ ఎపిసోడ్ తో సెకెండ్ ఆఫ్ పై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగి పోతాయి. ఇక సెకెండ్ ఆఫ్ ఆ అంచనాలను ఏమాత్రం తీసిపోని విధంగా ఉండగా…
మధ్యలో కొన్ని సీన్స్ స్లో అయినా కూడా ప్రీ క్లైమాక్స్ నుండి మళ్ళీ నాగార్జున ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ అండ్ మాస్ మూమెంట్స్ తో ఎమోషన్స్ ని మిక్స్ చేసి నాగార్జునకి మంచి కంబ్యాక్ మూవీలా ముగుస్తుంది…. సినిమాలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా పండగ నేపధ్యంలో…
తెరకెక్కిన నా సామి రంగ ఓవరాల్ గా ఈ సీజన్ కి పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా అనిపించిన సినిమా అని చెప్పాలి. నాగార్జున అటు యంగ్ రోల్ లో ఇటు ఏజ్ ఉన్న రోల్ లో అద్బుతంగా నటించి మెప్పించాడు, హీరోయిజం ఎలివేట్ సీన్స్ కూడా సాలిడ్ గా ఎలివేట్ అయ్యాయి అని చెప్పాలి. అల్లరి నరేష్ తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకోగా రాజ్ తరుణ్ కూడా తన రోల్ వరకు మెప్పించాడు…
ఇక ఆషికా రంగనాథ్ బాగా మెప్పించగా మిగలిన హీరోయిన్స్ కూడా పర్వాలేదు అనిపించారు, ఇక కీరవాణి అందించిన పాటలు బాగుండగా బ్యాగ్రౌండ్ స్కోర్ సాలిడ్ గా ఇంప్రెస్ చేసింది, ఎలివేషన్ సీన్స్ కి కీరవాణి ఓ రేంజ్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు… ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో మరింత టైట్ గా చేసి ఉంటే బాగుండేది….
ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదు అనిపించగా డైరెక్టర్ ఒరిజినల్ వర్షన్ ని తెలుగులో పెర్ఫెక్ట్ గా రీమేక్ చేశాడు, కొన్ని సీన్స్ బోర్ అనిపించినా కూడా ముందు చెప్పినట్లు పండగ కి పెర్ఫెక్ట్ అనిపించేలా చాలా సీన్స్ సినిమాలో ఉండటంతో పాటు నాగార్జున పెర్ఫార్మెన్స్ మేజర్ ప్లస్ అవ్వడంతో బోర్ సీన్స్ కూడా పెద్దగా ఇబ్బంది పెట్టలేదు…
ఓవరాల్ గా సినిమా ఒరిజినల్ చూడని వాళ్ళకి బాగా నచ్చుతుంది(మేం ఒరిజినల్ చూడలేదు), చూసిన వాళ్ళకి ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించవచ్చు, మొత్తం మీద లో ఎక్స్ పెర్టేషన్స్ తో వెళ్ళే ఆడియన్స్ కి పైసా వసూల్ మూవీల అనిపిస్తుంది నా సామి రంగ… ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 3 స్టార్స్.