బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో హాట్రిక్ ని కంప్లీట్ చేసుకున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) లాస్ట్ ఇయర్ చేసిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. స్లో స్టార్ట్ నే సొంతం చేసుకున్నా పాజిటివ్ టాక్ పవర్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర…
సాలిడ్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా మీద ఇప్పుడు కోలివుడ్ అలాగే కన్నడ ఇండస్ట్రీల హీరోల కన్ను పడింది… కన్నడలో శివరాజ్ కుమార్ ఈ సినిమా రీమేక్ మీద ఆసక్తి చూపుతూ ఉండగా మరో పక్క కోలివుడ్ టాప్ హీరో కూడా ఈ సినిమా మీద ఆసక్తిని చూపిస్తున్నాడని కోలివుడ్ లో స్ట్రాంగ్ బజ్ ఉంది…
ఆ టాప్ హీరో మరెవరో కాదు సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapthy Vijay)…త్వరలో రాజకీయాలలోకి వెళ్ళబోతున్న విజయ్ 2025 లోపు చేసే సినిమాలతో ఇక సినిమాలకు గుడ్ బాయ్ చెప్పడానికి సిద్ధం అవుతూ ఉండగా… ప్రస్తుతం గోట్ సినిమాను చేస్తున్న విజయ్….
ఆ సినిమా తర్వాత చివరి సినిమాను DVV బ్యానర్ లో చేయబోతున్నట్లు తెలుస్తుంది…ఇది లాస్ట్ మూవీ అని అంటూ ఉండటంతో సేఫ్ సైడ్ లో ఆడియన్స్ కి నచ్చే కాన్సెప్ట్ ఎంచుకోవాలని భావిస్తున్న విజయ్ కి భగవంత్ కేసరి కథ నచ్చిందని అంటున్నారు… కొన్ని చిన్న చిన్న మార్పులతో ఈ సినిమాను తమిళ్ లో తీయాలని అనుకుంటున్నాడట…
అదే కనుక నిజం అయితే సేఫ్ సైడ్ లో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే మరో మంచి సినిమాతో సినిమాలకు పులిస్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది కానీ ఆడియన్స్ మాత్రం ఓ భారీ ఒరిజినల్ సినిమాను ఎక్స్ పెర్ట్ చేస్తున్నారు… ఇంకా న్యూస్ అయితే కన్ఫాం అవ్వలేదు కానీ విజయ్ పోలిటిక్స్ లోకి వెళ్ళే ముందు లాస్ట్ మూవీ DVV బ్యానర్ లోనే ఉండబోతుంది అని సమాచారం.