మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్(Eagle Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వడానికి ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఉండగా సినిమా థియేట్రికల్ బిజినెస్ రేంజ్ మొత్తం మీద 21 కోట్ల దాకా రేటు ని సొంతం చేసుకోగా ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ లెక్కలు ఎంతవరకు…
సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారగా రీసెంట్ టైంలో అన్ని సినిమాల నాన్ థియేట్రికల్ రైట్స్ లెక్కలు తగ్గుతూ వస్తూ ఉండగా ఆ ఇంపాక్ట్ ఈగల్ మూవీ మీద కూడా పడింది… మొత్తం మీద సినిమా కి నాన్ థియేట్రికల్ రైట్స్ కింద 24 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం…
అందులో తెలుగు శాటిలైట్ రైట్స్ కింద 5 కోట్లు, డిజిటల్ రైట్స్ కింద 6 కోట్ల దాకా రేటుని ఓవరాల్ గా మ్యూజిక్ రైట్స్ కింద 1 కోటి దాకా బిజినెస్ ను సినిమా చేయగా హిందీ అలాగే ఇతర భాషల డబ్బింగ్ శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ కలిపి 12 కోట్ల దాకా బిజినెస్ ను సినిమా సొంతం చేసుకుందని అంచనా వేస్తున్నారు…
దాంతో టోటల్ గా నాన్ థియేట్రికల్ బిజినెస్ రేంజ్ 24 కోట్ల దాకా సినిమా సొంతం చేసుకోగా థియేట్రికల్ బిజినెస్ కూడా కలుపుకుంటే 45 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సినిమా ఓవరాల్ గా సొంతం చేసుకుంది… కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రికవరీ ఇంకా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉండగా టోటల్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కంప్లీట్ చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు.