Home న్యూస్ కేరళ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న మరో చిన్న సినిమా…ఆ బడ్జెట్ ఏంటి…ఈ కలెక్షన్స్ ఏంటి!!

కేరళ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న మరో చిన్న సినిమా…ఆ బడ్జెట్ ఏంటి…ఈ కలెక్షన్స్ ఏంటి!!

0

మలయాళ ఇండస్ట్రీలో చిన్న సినిమాలు కూడా అప్పుడప్పుడు పెద్ద విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటాయి… లాస్ట్ ఇయర్ కొన్ని సినిమాలు ఇలానే మంచి విజయాలను నమోదు చేయగా ఈ ఇయర్ అక్కడ ఇంకా సాలిడ్ స్టార్ట్ దక్కలేదు అనుకుంటున్న టైంలో రీసెంట్ గా బాక్ టు బాక్ హిట్స్ పడుతున్నాయి…

ఒక పక్క లేటెస్ట్ గా మలయాళ టాప్ స్టార్ మమ్ముట్టి(Mammootty) భ్రమయుగం(Bramayugam) సాలిడ్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ ఉండగా, ఈ సినిమా కన్నా వారం ముందు రిలీజ్ అయిన ఓ చిన్న సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతుంది. అందరూ కొత్త యాక్టర్స్ తో తెరకెక్కిన ఈ సినిమా…

హైదరాబాదు బేస్ చేసుకుని తీసిన ఓ యూత్ ఫుల్ లవ్ స్టొరీ… సినిమా పేరు ప్రేమలు(Premalu Movie)…..కేవలం 3 కోట్ల రేంజ్ బడ్జెట్ తోనే తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యునానిమస్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని అక్కడ అల్టిమేట్ కలెక్షన్స్ తో రోజు రోజుకి కలెక్షన్స్ లో…

సాలిడ్ గ్రోత్ ని చూపిస్తూ ఇప్పుడు 9 రోజుల్లోనే 30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుని ఇప్పటికీ సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది. 9 వ రోజు 10 వ రోజు వసూళ్లు ఇప్పుడు మొదటి రోజుకి మించి వస్తున్నాయి అంటే ఏ రేంజ్ లో అక్కడ ఈ సినిమా దుమ్ము లేపుతుందో అర్ధం చేసుకోవచ్చు….

బడ్జెట్ మీద ఆల్ రెడీ 10 రెట్లు కలెక్షన్స్ ని ఈ సినిమా సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా తెలుగు లో కూడా సినిమా పై డిమాండ్ ఏర్పడింది… బ్యాగ్ డ్రాప్ హైదరాబాద్ అవ్వడం, సినిమా కూడా మన మూవీస్ మాదిరిగానే ఉండటంతో సినిమా తెలుగు డబ్ కోసం మేకర్స్ కొందరు ట్రై చేస్తున్నారట. ఇక్కడ వర్కౌట్ అయితే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మరింత రచ్చ చేయోచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here