మాచో స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ భీమా(Gopichand Bhimaa Movie Review and Rating) ట్రైలర్ రిలీజ్ తో గోపీచంద్ కి మంచి కంబ్యాక్ మూవీగా నిలుస్తుంది అనిపించగా డీసెంట్ బజ్ నడుమ ఇప్పుడు సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో తెలుసుకుందాం పదండీ….
ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే….పరశురాముడు నిర్మించిన పరశురాముడి క్షేత్రం…కాల క్రమంలో చెడు శక్తుల చేతిలోకి వెళుతుంది…అలాంటి ఆ ఊరికి హీరో ఎంటర్ అవుతాడు, హీరో కి ఆ క్షేత్రానికి ఉన్న లింక్ ఏంటి….తర్వాత కథ ఏమయింది అన్నది మొత్తం మీద సినిమా చూసి తెలుసుకోవాల్సిందే….
పెర్ఫార్మెన్స్ పరంగా గోపీచంద్ మరోసారి మంచి ఈజ్ తో రెండు డిఫెరెంట్ రోల్స్ లో మెప్పించాడు…..మాస్ సీన్స్, ఎలివేషన్ లు ఓ రేంజ్ పడ్డాయి గోపీచంద్ కి, అలాగే గోపీచంద్ డైలాగ్స్ కూడా బాగా ఆకట్టుకోగా హీరోయిన్స్ ఇద్దరికీ మంచి స్క్రీన్ స్పేస్ దక్కగా ఇద్దరూ పర్వాలేదు అనిపించగా మిగిలిన యాక్టర్స్ అందరూ తమ తమ రోల్స్ లో ఆకట్టుకున్నారు…
సంగీతం ఓకే అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది, ఇంటర్వెల్, అండ్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ నుండి క్లైమాక్స్ ఎపిసోడ్ వరకు బ్యాగ్రౌండ్ స్కోర్ కుమ్మేశాడు రవి బసృర్….ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో పరమ రొటీన్ గా ఉంటుంది, సెకెండ్ ఆఫ్ లో సైతం స్క్రీన్ ప్లే కొంచం డ్రాగ్ అయ్యింది….
సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ చాలా బాగున్నప్పటికీ టేకింగ్ పరంగా స్క్రీన్ ప్లే పరంగా కొన్ని పూర్తిగా అంచనాలను అందుకోలేక పోయాడు. సినిమా స్టార్ట్ అవ్వడం ఆసక్తిగా స్టార్ట్ హీరో ఎంట్రీ తో మంచి కిక్ ఇచ్చిన తర్వాత పరమ రొటీన్ గా సాగుతుంది సినిమా…
అక్కడక్కడా కొంచం కామెడీ పర్వాలేదు అనిపించినా లవ్ సీన్స్ పరమ బోర్ ఫీల్ అయ్యేలా చేస్తూ సాగి ప్రీ ఇంటర్వెల్ నుండి సినిమా టేక్ ఆఫ్ అవుతుంది.. ఇంటర్వెల్ ఎపిసోడ్ గోపీచంద్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించేలా ఉండగా సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరుగుతాయి, సెకెండ్ ఆఫ్ కథ కొంచం అక్కడక్కడా డ్రాగ్ అయినా కూడా…
ఫస్టాఫ్ తో పోల్చితే సెకెండ్ బెటర్ గా ఉండగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ నుండి సినిమా రేంజ్ మరో లెవల్ లో ఉంటుంది. మొత్తం మీద సినిమాలో గోపీచంద్ పెర్ఫార్మెన్స్, ఇంటర్వెల్ అండ్ మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, కొన్ని ఎలివేషన్ సీన్స్ బాగుండటం ప్లస్ పాయింట్స్ కాగా, పరమ రొటీన్ లవ్ సీన్స్, ఫస్టాఫ్ చాలా స్లో గా ఉండటం, సెకెండ్ ఆఫ్ లో కూడా కథ డ్రాగ్ అవ్వడం మేజర్ డ్రా బ్యాక్స్ అని చెప్పాలి…
మొత్తం మీద సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఇంటర్వెల్, క్లైమాక్స్ అండ్ కొన్ని ఎలివేషన్స్ కోసం కొంచం బోర్ ఫీల్ అయినా ఒకసారి చూసేలా సినిమా ఉందని చెప్పాలి. రీసెంట్ గోపీచంద్ మూవీస్ తో పోల్చితే బెటర్ అనే చెప్పాలి కానీ మరీ ఎక్స్ పెర్ట్ చేసిన రేంజ్ కి సినిమా వెళ్ళలేక పోయింది. అయినా కానీ కొంచం ఓపిక పడితే ఈజీగా ఒకసారి చూడొచ్చు…. మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్….