Home గాసిప్స్ RGV వ్యూహం…..అక్కడ దెబ్బ…ఇక్కడ డబుల్ దెబ్బ సామి!

RGV వ్యూహం…..అక్కడ దెబ్బ…ఇక్కడ డబుల్ దెబ్బ సామి!

0

ఎలక్షన్స్ నేపధ్యంలో వరుస పెట్టి సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తూ ఉన్నా కూడా ఏవి కూడా ఆడియన్స్ ను థియేటర్స్ లోకి రప్పించ లేక పోతున్నాయి…. వాటిలో ఎప్పటి నుండో హిట్ కి దూరం అయిన డైరెక్టర్స్ లో ఒకరైన రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తీసిన లేటెస్ట్ మూవీ వ్యూహం(Vyooham Box Office Collections) సినిమా….

రీసెంట్ గా అనేక సెన్సార్ ఇబ్బందులను ఫేస్ చేసి ఎలాగోలా రిలీజ్ అయినా కూడా ఏమాత్రం ఇంపాక్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించ లేక డెఫిసిట్ లు షోలు కాన్సిల్ అవ్వడం జరిగి ప్రింట్స్ అండ్ థియేటర్స్ ఖర్చులు కూడా రికవరీ చేయలేక డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది…

బాక్స్ ఆఫీస్ దగ్గర దెబ్బ పడిన ఈ సినిమాను డిజిటల్ లో అయినా త్వరగా రిలీజ్ చేయాలి అనుకున్నా కూడా ఇక్కడ డిజిటల్ లో కూడా ఈ సినిమాను కొనడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు అని తెలుస్తుంది… ఇది వరకు రామ్ గోపాల్ వర్మ సినిమాలు అంటే బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా ఎంతో కొంత….

డిజిటల్ లో అలాగే టెలివిజన్ లో రైట్స్ అయినా అమ్ముడు పోయేవి, కానీ ఈ సినిమా విషయానికి వస్తే వ్యూహం సినిమాను కొనడానికి కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదని ట్రేడ్ లో స్ట్రాంగ్ బజ్ ఉంది… మొత్తం మీద సినిమా తో జనాలకు ఎదో చెప్పాలి అనుకున్న టీం కి అటు ఆడియన్స్ విముఖతని చూపించగా ఇటు డిజిటల్ లో కూడా డబుల్ దెబ్బ పడినట్లు అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here