బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) రీసెంట్ టైంలో సినిమా సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ దూసుకు పోతూ ఉండగా చాలా కాలంగా విశ్వక్ సేన్ నటించి డిలే అయిన గామి(Gaami Movie) తో రీసెంట్ గా వచ్చి ఆడియన్స్ ను మెప్పించి సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకున్నాడు…
మొదటి రోజు అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయిన గామి సినిమా 2.96 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను అందుకుని దుమ్ము లేపగా తన ప్రీవియస్ మూవీ దాస్ కా ధమ్కి సినిమాతో తన కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకుని దుమ్ము లేపాడు…
ఇది వరకు చేసిన సినిమాల ఓపెనింగ్స్ చాలా తక్కువగా ఉండగా రీసెంట్ గా చేసిన సినిమాలతో సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకుని కెరీర్ లో మంచి గ్రోత్ ను సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. ఒకసారి విశ్వక్ సేన్ నటించిన రీసెంట్ మూవీస్ డే 1 కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
#VishwakSen Recent Movies Day 1 AP-TG Collections
👉#Gaami – 2.96CR******
👉#DasKaDhamki – 3.06CR
👉#Oridevuda – 90L~
👉#AshokaVanamloArjunaKalyanam – 65L~
👉#Paagal – 1.30Cr
👉#HITTheFirstCase – 1.32Cr
👉#FalaknumaDas – 1.02Cr~
ఆల్ మోస్ట్ కోటి రేంజ్ ఓపెనింగ్స్ నుండి ఇప్పుడు ఏకంగా 3 కోట్ల రేంజ్ దాకా ఓపెనింగ్స్ ను అందుకుంటూ ఉండటం కెరీర్ లో మంచి గ్రోత్ అనే చెప్పాలి…ఇక తన అప్ కమింగ్ మూవీస్ తో ఇదే రేంజ్ ను కొనసాగిస్తే మీడియం రేంజ్ హీరోలలో ప్రామిసింగ్ హీరోగా మంచి మార్కెట్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.