బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఇప్పటి వరకు మూడు నెలలు కంప్లీట్ అవ్వగా ఈ మూడు నెలల్లో రిలీజ్ అయిన మూవీస్ అన్నింటిలో బిగ్ మూవీ ఏది అంటే మాత్రం సంక్రాంతికి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Sreenivas) ల కాంబోలో వచ్చిన గుంటూరు కారం(Guntur Kaaram Movie)….పెద్ద సినిమా…
మిగిలిన సినిమాలు అన్నీ చిన్న టు మీడియం రేంజ్ మూవీస్ కాగా ఈ సినిమా మీద క్రేజీ అంచనాలు ఉండగా ఓపెనింగ్స్ వీర లెవల్ లో కుమ్మేసినా కూడా తర్వాత రోజు నుండి మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ వలన కలెక్షన్స్ భారీగా స్లో అయ్యాయి. ఓవర్సీస్ లో సైతం కలెక్షన్స్ స్లో అయ్యాయి కానీ మహేష్ త్రివిక్రమ్ లకు ఓవర్సీస్ లో ఉన్న మార్కెట్ దృశ్యా…
ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా దుమ్ము లేపుతుంది అనుకున్నా కూడా మొదటి రోజు అక్కడ $383K డాలర్స్ ను మాత్రమే వసూల్ చేసింది. ఈ సినిమాతో పాటే రిలీజ్ అయిన హనుమాన్(HanuMan Movie) అదే రోజున అమెరికాలో $506K డాలర్స్ ను వసూల్ చేసి దుమ్ము లేపింది…తర్వాత వచ్చిన ఏ సినిమాలు కూడా వీటి రేంజ్ లో…
వసూళ్లు అందుకోలేదు… కానీ లేటెస్ట్ గా వచ్చిన సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) మొదటి రోజు అమెరికాలో గుంటూరు కారం కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ ని సాధించి హనుమాన్ కి దగ్గర దాకా వెళ్ళింది… సినిమా మొదటి రోజు అమెరికాలో..
$486K డాలర్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది.. 2 మీడియం రేంజ్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఇప్పటి వరకు వచ్చిన క్రేజీ మూవీ కన్నా బెటర్ కలెక్షన్స్ ని అందుకోవడం బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అని చెప్పాలి. ఎంత పెద్ద స్టార్ కాంబో అయినా ఏ సినిమాకి అయినా టాక్ చాలా ముఖ్యమని ఈ సినిమాలు నిరూపించాయి. ఇక ఇయర్ ఎండ్ వరకు ఎన్ని సినిమాలు ఇలా జోరు చూపిస్తాయో చూడాలి.