బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన కలెక్షన్స్ తో మాస్ రాంపెజ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ టిల్లు స్క్వేర్ మూవీ(Tillu Square Movie) ఇప్పుడు టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాల జాబితాలో ఎంటర్ అవుతూ ఒక్కో సినిమా కలెక్షన్స్ ని…
క్రాస్ చేస్తూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉండటం విశేషం, ఈ క్రమంలో ఇప్పుడు సినిమా 9వ రోజు సాధించిన కలెక్షన్స్ తో మూడేళ్ళ క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లకల్లోలం సృష్టించిన ఉప్పెన(Uppena Movie) టోటల్ రన్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసింది….ఆ సినిమా ఆ టైంలో విపరీతమైన హైప్ నడుమ రిలీజ్ అయ్యి…
టోటల్ రన్ లో ఏకంగా 51.52 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని సంచలన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు 9 రోజుల్లో 52.5 కోట్లకు పైగా షేర్ ని అందుకుని ఉప్పెన సినిమా కలెక్షన్స్ ని దాటేసిన టిల్లు స్క్వేర్ మూవీ కి తర్వాత బాక్స్ ఆఫీస్ రన్ లో ఇదే జోరు ని చూపించే అవకాశం ఉండగా దగ్గరలో నిఖిల్ సిద్దార్థ్ నటించిన….
కార్తికేయ2(Karthikeya2 Movie) ఉంది…ఆ సినిమా టోటల్ రన్ లో 58.40 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. వచ్చే రోజుల్లో హాలిడేస్ అడ్వాంటేజ్ కూడా పుష్కలంగా ఉండటంతో టిల్లు స్క్వేర్ మూవీ ఆ సినిమా కలెక్షన్స్ ని కూడా క్రాస్ చేయడం ఖాయమని చెప్పాలి. మరి అది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందో చూడాలి ఇప్పుడు.