Home న్యూస్ టిల్లు స్క్వేర్: 8 కోట్లకు అమ్మితే…నైజాంలో టోటల్ గా వచ్చింది ఇది!!

టిల్లు స్క్వేర్: 8 కోట్లకు అమ్మితే…నైజాంలో టోటల్ గా వచ్చింది ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 2024 సమ్మర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Nizam Total Collections)….మొదటి పార్ట్ అల్టిమేట్ హిట్ తర్వాత రెండో పార్ట్ పై భారీ హైప్ నెలకొనగా రెండో పార్ట్ ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ నుండి మాస్ రచ్చ చేసిన టిల్లు స్క్వేర్…

ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను కూడా సొంతం చేసుకుని ఇప్పుడు పరుగును ఒక్కో ఏరియాలో కంప్లీట్ చేసుకుంటూ ఉండగా నైజాం ఏరియాలో సినిమా టోటల్ రన్ లో ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని హ్యుమంగస్ లాభాలను దక్కించుకుని దుమ్ము దుమారం లేపింది…

నైజాంలో సినిమా మీద ఉన్న హైప్ దృశ్యా 8 కోట్ల రేంజ్ రేటుకి అమ్మగా వీకెండ్ లోనే ఈ మొత్తాన్ని రికవరీ చేసిన టిల్లు స్క్వేర్ తర్వాత లాంగ్ రన్ ను కూడా దక్కించుకుని 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్ల తర్వాత కూడా స్లో అవ్వకుండా 25 కోట్ల మమ్మోత్ షేర్ మార్క్ ని దాటేసింది…. ఇప్పుడు టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి…

Tillu Square 16 Days Total WW Collections

అక్షరాలా 26.55 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది….ఓవరాల్ గా 8 కోట్ల బిజినెస్ కి 26.55 కోట్ల షేర్ ని అందుకున్న టిల్లు స్క్వేర్ మూవీ బిజినెస్ మీద ఇక్కడ 18.55 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఒక్క నైజాం ఏరియాలోనే ఈ రేంజ్ లో లాభాలను…

సినిమా సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. 2024 సమ్మర్ లో వన్ అండ్ ఓన్లీ బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా సమ్మర్ లో చప్పగా సాగిన థియేటర్స్ లో ఎంతో కొంత ఊరటని కలిగించింది… రెండో పార్ట్ తో అద్బుతాలు సృష్టించిన ఈ సినిమా మూడో పార్ట్ భీభాత్సాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది.

Tillu Square 12 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here