లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) అలాగే ఈ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(Family Star Movie) సినిమాలు…
వీకెండ్ ని పూర్తి చేసుకుని వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా రెండు సినిమాలు డ్రాప్ అయ్యాయి కానీ ది ఫ్యామిలీ స్టార్ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందని చెప్పాలి ఇప్పుడు, అదే టైంలో టిల్లు స్క్వేర్ మూవీ ఆల్ రెడీ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా ఇక మీదట వచ్చేవన్నీ కూడా బోనస్ అనే చెప్పాలి.
మొత్తం మీద 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ది ఫ్యామిలీ స్టార్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజుతో పోల్చితే ఆల్ మోస్ట్ 70% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా టిల్లు స్క్వేర్ మూవీ 11వ రోజు ఆల్ మోస్ట్ 50-60% రేంజ్ లో డ్రాప్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో…
ది ఫ్యామిలీ స్టార్ మూవీ అటూ ఇటూగా 45-50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి, వరల్డ్ వైడ్ గా సినిమా 65 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా టిల్లు స్క్వేర్ మూవీ 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది.
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఓవరాల్ గా టిల్లు స్క్వేర్ మూవీ బాక్స్ ఆఫీస్ జోరు కొనసాగుతూ ఉండగా ది ఫ్యామిలీ స్టార్ మూవీ మాత్రం దెబ్బ మీద దెబ్బతో భారీ నష్టాలను సొంతం చేసుకునే అవకాశం పెరిగిపోతూ ఉంది.