Home న్యూస్ టాలీవుడ్ ఫాస్టెస్ట్ 1M లైక్స్ టీసర్ రికార్డ్స్!!

టాలీవుడ్ ఫాస్టెస్ట్ 1M లైక్స్ టీసర్ రికార్డ్స్!!

0

టాప్ స్టార్స్ నటించిన సినిమాల టీసర్ లు ట్రైలర్ లు వస్తే చాలు వాటి రికార్డులతో సోషల్ మీడియా మొత్తం హడావుడిగా ఉంటుంది, మన స్టార్స్ రీసెంట్ టైంలో పాన్ ఇండియా మూవీస్ చేస్తూ మార్కెట్ ను పెంచుకుంటూ ఉండగా సినిమాలు ఆలస్యంగా వస్తూ ఉండగా కొత్త రికార్డులు నమోదు అవ్వడానికి చాలా టైమే పడుతూ ఉంది…

రీసెంట్ టైంలో టాలీవుడ్ టీసర్ లలో 1 మిలియన్ లైక్స్ ని అందుకున్న టీసర్ లు చాలా తక్కువే కాగా మొదటగా ఈ రికార్డ్ ను RRR మూవీలో వచ్చిన ఎన్టీఆర్(Jr NTR) ఇంట్రో టీసర్ ఈ రికార్డ్ ను నమోదు చేసింది…తర్వాత అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప(Pushpa The Rise) ఈ మార్క్ ని అందుకుంది…. కేవలం తెలుగు వర్షన్ టీసర్ ల పరంగా ఈ రికార్డ్ ను ఏ సినిమా టచ్ అయితే చేయలేదు…

కానీ సింగిల్ ఛానెల్ లో రిలీజ్ అయిన టీసర్ లలో ప్రభాస్(Prabhas) సలార్(Salaar Movie) టీసర్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ ను అందుకుంది… రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన పుష్ప2 టీసర్(Pushpa The Rule Teaser) కూడా 1 మిలియన్ లైక్స్ ను అందుకుంది కానీ టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుంది…

మొత్తం మీద ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ ని అందుకున్న టీసర్ లను గమనిస్తే… 
Tollywood Fastest 1 Million Likes Teasers
👉#Salaar Teaser – 6hrs 15Mins~
👉#Pushpa2TheRuleTeaser – 9hrs 59Mins~******
👉#RamarajuForBheem – 36 Hours 04 Minutes
👉#IntroducingPushpaRaj – 59Hrs 10Mins+

ఇవి మొత్తం మీద టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ మార్క్ ని అందుకున్న టీసర్ లు, ఇక ఈ ఇయర్ లో మరిన్ని బిగ్ మూవీస్ టీసర్ లు రిలీజ్ కానున్నాయి కాబట్టి ఈ లిస్టులో చేరే సినిమాలు మరిన్ని వచ్చే అవకాశం ఉంది, అందులో ఎన్ని సినిమాలు కొత్త రికార్డులను నమోదు చేస్తాయో చూడాలి ఇక….

AP-TG 2nd Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here