బాక్స్ అఫీస్ దగ్గర ఈ ఇయర్ బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అక్షయ్ కుమార్(Akshay Kumar) ఇప్పుడు టైగర్ ష్రాఫ్(Tiger Shroff) తో కలిసి చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ బడే మియా చోటే మియా(Bade Miyan Chote Miyan)…రంజాన్ కానుకగా ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో వస్తున్న ఈ సినిమా మీద…
బాలీవుడ్ భారీ ఆశలు పెట్టుకుంది, ఆల్ మోస్ట్ 350 కోట్ల రేంజ్ మమ్మోత్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్ సీన్స్ మరో లెవల్ లో ఉంటాయని చెబుతూ ఉండగా సినిమా బడ్జెట్ కి ఫుల్ న్యాయం చేసేలా విజువల్ వండర్ లా ఉంటుంది అంటూ ఓ రేంజ్ లో హైప్ ఇచ్చారు.
కానీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన సెంటర్స్ లో చాలా వీక్ బుకింగ్స్ ఉండటంతో ఏ[ఏప్రిల్ 10న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమాను ఇప్పుడు 11న రిలీజ్ చేయబోతూ ఉండగా సినిమా బుకింగ్స్ చూసి బాలీవుడ్ శాకయ్యింది ఇప్పుడు.
మొదటి రోజు ముందు 20-25 కోట్ల రేంజ్ లో అయినా నెట్ కలెక్షన్స్ ని అందుకుంటుంది అని అంచనా వేసినా ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే 15 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ వచ్చేలా ఉన్నాయంటూ చెబుతున్నారు. 350 కోట్ల సినిమాకి 15 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ అంటే అది దారుణం అనే చెప్పాలి. మరి సినిమాకి టాక్ పాజిటివ్ గా ఏమైనా జోరు పెంచుతుందో చూడాలి ఇప్పుడు.