బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో అన్నది ఎవ్వరూ ఊహించ లేరు అనే చెప్పాలి…టాలీవుడ్ లో మంచి టేస్ట్ ఉన్న నిర్మాతలలో ఒకరిగా పేరున్న దిల్ రాజు(Dil Raju) కి డిస్ట్రిబ్యూషన్ లో కొన్ని మంచి సినిమాలు సొంతం అయినా కూడా నిర్మాతగా అప్పుడప్పుడు కొన్ని ఊహకందని దెబ్బలు కూడా తగ్గాయి…
అప్పుడప్పుడు భారీ ఆశలు పెట్టుకున్న సినిమాలు అత్యంత తీవ్రంగా నిరాశ పరిచాయి…లాస్ట్ ఇయర్ దిల్ రాజు నిర్మించిన సినిమాల్లో భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాగా సమంత(Samantha) తో తీసిన శాకుంతలం(Shaakuntalam Movie) సినిమా ఆల్ మోస్ట్ 70 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కగా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి…
ఆల్ మోస్ట్ 1 ఏడాది కంప్లీట్ అవ్వగా ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు ఏప్రిల్ నెలలో దిల్ రాజు భారీ నమ్మకం పెట్టుకున్న విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన ది ఫ్యామిలీ స్టార్(The Family Star Movie) భారీ ఆశల నడుమ రిలీజ్ అయ్యి తీవ్రంగా నిరాశ పరిచింది… ఈ రెండు సినిమాలు కూడా బడ్జెట్ పరంగా…
చూసుకుంటే బిగ్గెస్ట్ ఫ్లాఫ్స్ లో ఒకటి అనిపించేలా నిరాశ పరిచాయి. లాస్ట్ ఇయర్ వచ్చిన శాకుంతలం ఆల్ మోస్ట్ 70 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో తెరకెక్కగా 4.5 కోట్ల షేర్ ని కూడా రాబట్టలేక భారీ ఫ్లాఫ్ మూవీగా నిలిచింది. అంటే ఆల్ మోస్ట్ బడ్జెట్ కి 65 కోట్ల రేంజ్ లో లాస్ వచ్చింది… ఇక ఈ ఇయర్ సమ్మర్ లో వచ్చిన…
ది ఫ్యామిలీ స్టార్ మొత్తం మీద 17-18 కోట్లు కూడా అందుకోవడం కష్టంగా కనిపిస్తూ ఉండగా సినిమా ఆల్ మోస్ట్ 90 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కగా బడ్జెట్ పరంగా చూసుకుంటే ఈ సినిమా కూడా ఆల్ మోస్ట్ ఇప్పుడు 70 కోట్లకు పైగా నష్టాన్ని సొంతం చేసుకుందని చెప్పొచ్చు. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన వచ్చిన…
బిగ్ బడ్జెట్ మూవీస్ లో ఆల్ మోస్ట్ లాస్ట్ ఇయర్ సమ్మర్ కి ఈ ఇయర్ సమ్మర్ కి 2 సినిమాలతో ఆల్ మోస్ట్ 140 కోట్ల రేంజ్ లో లాస్ బడ్జెట్ పరంగా సొంతం అయ్యింది. కానీ రెండు సినిమాలు నాన్ థియేట్రికల్ రైట్స్ బాగానే వచ్చాయి అంటూ ఉండటంతో రికవరీ ఉన్నప్పటికీ ఓవరాల్ గా బడ్జెట్ పరంగా చూసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ లు సొంతం అయ్యాయి అని చెప్పాలి.