Home న్యూస్ కల్కి హిందీ బిజినెస్…..రెబల్ స్టార్ మాస్…హిట్ అవ్వాలి అంటే ఎంత కావాలంటే!

కల్కి హిందీ బిజినెస్…..రెబల్ స్టార్ మాస్…హిట్ అవ్వాలి అంటే ఎంత కావాలంటే!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లాస్ట్ ఇయర్ ఆదిపురుష్(AdiPurush) మరియు సలార్(Salaar Movie) తో సందడి చేయగా ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు కల్కి 2898AD( Kalki2898AD Movie) తో దుమ్ము లేపడానికి సిద్ధం అవుతున్నాడు. సమ్మర్ ఎండ్ టైంకి రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న…

ఈ సినిమా మీద ఆల్ రెడీ అంచనాలు స్కై హై లెవల్ లో ఉన్నాయి. గ్లిమ్స్ వీడియోతోనే సినిమా ఎలా ఉండబోతుందో అన్నది అందరికీ అర్ధం అవ్వగా సినిమా టీసర్ ట్రైలర్ లు రిలీజ్ అయిన తర్వాత అంచనాలు మరింతగా పెరిగి పోవడం ఖాయమని చెప్పాలి. ఇక రిలీజ్ కన్ఫాం చేసుకోని ఈ సినిమా కి బిజినెస్ ఇప్పటి నుండే…

మంచి జోరుగా సాగుతూ ఉండగా రీసెంట్ గా టాలీవుడ్ బిగ్ మూవీస్ హిందీ బిజినెస్ రేంజ్ లు కన్ఫాం అయ్యాయి…అందులో ముందుగా రిలీజ్ కాబోతున్న బిగ్ పాన్ ఇండియా మూవీ అయిన కల్కి మూవీకి హిందీలో మంచి బిజినెస్ సొంతం అయ్యింది అని చెప్పాలి. అడ్వాన్స్ బేస్ మీద ఆల్ మోస్ట్ సినిమా కి 90 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఒక్క హిందీలోనే…

జరిగినట్లు తెలుస్తుంది… ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే లాంటి భారీ స్టార్ కాస్ట్ తో వస్తున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపధ్యంలో తెరకెక్కుతూ ఉండటంతో అంచనాలను ఏమాత్రం అందుకున్నా కూడా సంచలన కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి…

ఇక హిందీ లో ఈ అడ్వాన్స్ బేస్ బిజినెస్ దృశ్యా సినిమా హిట్ అవ్వాలి అంటే 180-185 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని హిందీ లో సొంతం చేసుకోవాల్సి ఉంటుంది… ఆ రేంజ్ కలెక్షన్స్ రావాలి అంటే సినిమా కి హిందీ లో యునానిమస్ రెస్పాన్స్ చాలా అవసరం అని చెప్పొచ్చు. మరి సినిమా హిందీలో ఎంతవరకు జోరు చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here