Home న్యూస్ అప్పుడేమో తిట్టారు…ఇప్పుడు 200M తో ఊచకోత ఇది!

అప్పుడేమో తిట్టారు…ఇప్పుడు 200M తో ఊచకోత ఇది!

0

ఒక స్టార్ హీరో ఒక స్టార్ డైరెక్టర్ సినిమాలో ఇలా ఒక బూతు పదం ఉన్న పాటను పెట్టుకోవడం ఏంటి…సినిమా రీచ్ కోసం ఇలాంటి పాటను ఎలా పెట్టుకుంటారు…యూత్ పై ఇది ఎఫెక్ట్ చూపుతుంది…ఇలా అనేక ట్రోల్స్ వచ్చాయి సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram) ల కాంబోలో వచ్చిన…

గుంటూరు కారం(Guntur Kaaram Movie) నుండి రిలీజ్ అయిన కుర్చీ మడతపెట్టి(Kurchi Madathapetti) సాంగ్ రిలీజ్ టైంలో….పాట చాలా క్యాచీగా ఉన్నప్పటికీ సాంగ్ రిలీజ్ టైంలో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ ని ఫేస్ చేసిన ఈ సాంగ్ సినిమాకే మైనస్ అంటూ కామెంట్స్ చేశారు…

కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఆ సాంగ్ లో మహేష్ శ్రీలీలల ఎక్స్ లెంట్ స్టెప్స్ అండ్ మాస్ బీట్స్ కి థియేటర్స్ షేక్ అయ్యాయి…ఈ పాటల వలనే యావరేజ్ గా ఉన్న సినిమాకి ఎంతో కొంత బెటర్ గా ఫుట్ ఫాల్స్ సొంతం అయ్యాయి. ఇక ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ అయిన తర్వాత యూట్యూబ్ లో సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ సొంతం అయ్యింది…

Guntur Kaaram 11 Days Total WW Collections!

స్టేట్ నుండి నేషనల్, నేషనల్ నుండి ఇంటర్నేషనల్ లెవల్ కి పాట రీచ్ పెరిగి పోయి రీసెంట్ టైంలో వన్ ఆఫ్ మోస్ట్ రిపీట్ వాల్యూ ఉన్న సాంగ్ గా నిలిచింది… ఇప్పుడు ఏకంగా 200 మిలియన్ వ్యూస్ మార్క్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించిన ఈ సాంగ్ రీచ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉండగా…

రోజూ వ్యూస్ అండ్ లైక్స్ కూడా పెరిగి పోతూనే ఉండటం విశేషం అని చెప్పాలి. సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఓ రేంజ్ లో ట్రోల్స్ ని ఫేస్ చేసిన సాంగ్ కి ఇప్పుడు ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం మాత్రం రీసెంట్ టైంలో ఈ సాంగ్ కే సొంతం అయ్యింది అని చెప్పాలి. ఇక యూట్యూబ్ లో లాంగ్ రన్ లో ఈ సాంగ్ ఇంకా ఎలాంటి అద్బుతాలు సృష్టిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here