Home న్యూస్ బిజినెస్ మాన్ రికార్డును టార్గెట్ చేసిన గిల్లి…రీ రిలీజ్ సెన్సేషన్!

బిజినెస్ మాన్ రికార్డును టార్గెట్ చేసిన గిల్లి…రీ రిలీజ్ సెన్సేషన్!

0

తెలుగు లో రీ రిలీజ్ ల ట్రెండ్ లాస్ట్ 2 ఏళ్లలో ఓ రేంజ్ లో ఊపేసిన తర్వాత రీసెంట్ గా ఈ ట్రెండ్ స్లో అయింది..విచ్చలవిడిగా రీ రిలీజ్ చేయడంతో ఆడియన్స్ ఏ సినిమా పడితే ఆ సినిమాకి వెళ్ళే మూడ్ లో ఇప్పుడు లేరు…దాంతో టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ స్లో అయిన తరుణంలో ఇన్ని రోజులు పెద్దగా…

రీ రిలీజ్ ల మీద ఫోకస్ చేయని కోలివుడ్ లో మాత్రం ఇప్పుడు బిగ్ రీ రిలీజ్ ను చేశారు, కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిన ఒక్కడు మూవీ రీమేక్ గిల్లి(Gilli Movie Re Release)…సినిమాను రీసెంట్ గా రీ రిలీజ్ చేశారు. తమిళ్ లో ఆల్ మోస్ట్ 300 కి పైగా…

థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా కూడా గ్రాండ్ గా రీ రిలీజ్ అయ్యింది. రిలీజ్ కి ముందు రోజే అడ్వాన్స్ టికెట్ సేల్స్ ద్వారా 3 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు మొదటి రోజు కలెక్షన్స్ పరంగా రీ రిలీజ్ మూవీస్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న టాలీవుడ్…

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన బిజినెస్ మాన్(BusinessMan Re Release) మూవీ కలెక్షన్స్ ని టార్గెట్ చేయబోతుంది. బిజినెస్ మాన్ మొదటి రోజు రీ రిలీజ్ లో ఏకంగా 5.27 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను వరల్డ్ వైడ్ గా అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 4.37 కోట్ల ఓపెనింగ్స్ సొంతం అయ్యాయి…

ఇప్పుడు తమిళనాడు అలాగే వరల్డ్ వైడ్ గా గిల్లి మూవీ మొదటి రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెబుతూ ఉండటంతో బిజినెస్ మాన్ రీ రిలీజ్ రికార్డ్ ను బ్రేక్ చేసి కొత్త రికార్డ్ ను నమోదు చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉందని చెప్పాలి. మరి డే 1 కలెక్షన్స్ పరంగా సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here