బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన పెద్ద సినిమాలు అన్నీ కూడా పోస్ట్ పోన్ అవ్వడంతో ఉన్నంతలో బడ్జెట్ పరంగా పెద్ద సినిమాలను ఏమాత్రం తీసిపోని 90 కోట్ల బడ్జెట్ తో వచ్చిన విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన ది ఫ్యామిలీ స్టార్(The Family Star Movie) మూవీ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి…
అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అయ్యింది, దాంతో కొన్న వాళ్ళకి భారీ లెవల్ లో నష్టాలను సొంతం అయ్యేలా చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ చాలా త్వరగానే కంప్లీట్ చేసుకోగా రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ లో సినిమా రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అవ్వగా…
ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత సినిమాకి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని అందరూ ఎదురు చూస్తూ ఉండగా ఇక్కడ కూడా సినిమాకి సెకెండ్ రౌండ్ ట్రోల్స్ చాలా గట్టిగానే పడుతున్నాయి…. సినిమా కంటెంట్ కొన్ని చోట్ల ఆకట్టుకున్నా కూడా చాలా వరకు సినిమా బోర్ ఫీల్ అయ్యేలా చేసిందని…
సెకెండ్ ఆఫ్ లో చాలా సీన్స్ మినిమమ్ ఆసక్తిని కలిగించ లేక పోయాయి అని అంటూ ఉండగా సినిమాలో హీరో తన ఇంటి లేడిస్ ను కాపాడే సీన్ తర్వాత విలన్ కి మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు అంటూ చెప్పే డైలాగ్ కానీ సెకెండ్ ఆఫ్ లో టైం స్క్వేర్ దగ్గర సీన్ కానీ ఏమాత్రం బాలేవని అంటున్నారు…
మొత్తం మీద విజయ్ దేవరకొండ మృణాల్ లు ఆకట్టుకున్నా కూడా డైరెక్టర్ గా పరశురాం కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడని అంటూ ఉండగా, గీత గోవిందం లాంటి సినిమా తర్వాత వీళ్ళ కాంబో నుండి రావాల్సిన సినిమా అయితే ఇది కాదని అంటూ ఉన్నారు….ఓవరాల్ గా డిజిటల్ లో రిలీజ్ అయ్యాక సినిమాకి మరింత మిక్సుడ్ టు నెగటివ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వస్తుందని చెప్పాలి ఇప్పుడు.