మూడేళ్ళ క్రితం ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ రికార్డులతో దుమ్ము దుమారం లేపిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ల కాంబోలో ఇండియన్ టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి(SS Rajamouli) డైరెక్షన్ లో తెరకెక్కిన సెన్సేషనల్ మూవీ ఆర్ ఆర్ ఆర్(RRR MOVIE JAPAN TOTAL COLLECTIONS)….సినిమా…
అల్టిమేట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని తెలుగు లో రికార్డుల ఊచకోత కోసింది…. కాగా తర్వాత సినిమా ఇతర దేశాల్లో కూడా రిలీజ్ అవ్వడం జరగగా జపాన్ లో సినిమా కి అనుకున్న దానికన్నా కూడా సాలిడ్ రెస్పాన్స్ అండ్ ఊహకందని లాంగ్ రన్ సొంతం అయ్యింది… జపాన్ లో 200 డేస్ ను ఆల్ మోస్ట్ 119 స్క్రీన్స్ లో కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా…
తర్వాత కూడా లిమిటెడ్ స్క్రీన్స్ లో రన్ ని అలాగే కొనసాగించింది. అన్ని చోట్ల రన్ ఎండ్ అయినా కూడా జపాన్ లో మాత్రం సినిమా రన్ ఎండ్ అవ్వలేదు…ఆల్ మోస్ట్ అక్కడ రిలీజ్ అయ్యి 550 డేస్ ను కూడా కంప్లీట్ చేసుకుని సంచలనం సృష్టించింది ఈ సినిమా….అక్కడ సినిమా ఓవరాల్ గా 2.44 బిలియన్ జపాన్ యెన్స్ ను కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది ఈ సినిమా…
ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే ఆల్ మోస్ట్ 134.50 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను సినిమా అక్కడ సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…ఇన్ని రోజులు అక్కడ సినిమా రన్ అవ్వడం అన్నది మామూలు విషయం కాదని చెప్పాలి. గట్టిగా చెప్పాలి అంటే ఇండియాలోనే 100 రోజులు చాలా తక్కువ సెంటర్స్ లో…
కంప్లీట్ చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ జపాన్ లో మాత్రం ఇప్పటికీ కొన్ని లిమిటెడ్ స్క్రీన్స్ లో రన్ అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. అక్కడ వన్ ఆఫ్ ది ఎపిక్ రన్ ని అందుకున్న ఇండియన్ మూవీ గా ఈ సినిమా ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది. ఫ్యూచర్ లో ఈ రికార్డ్ ను ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి.