Home గాసిప్స్ హిట్ కొట్టి చాలా ఏళ్ళు…రాజశేఖర్ బిగ్గెస్ట్ కంబ్యాక్ సాలిడ్ మూవీ సిద్ధం!

హిట్ కొట్టి చాలా ఏళ్ళు…రాజశేఖర్ బిగ్గెస్ట్ కంబ్యాక్ సాలిడ్ మూవీ సిద్ధం!

0

టాలీవుడ్ సీనియర్ హీరోలలో హిట్ కొట్టి చాలా కాలం అవుతున్న వాళ్ళలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్(Dr.Rajashekhar) ఒకరు….అప్పుడెప్పుడో 2008 టైంలో గోరింటాకు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రాజశేఖర్ తర్వాత టైంలో గరుడవేగ లాంటి మంచి రీ ఎంట్రీ ఇచ్చినా విజయాన్ని అందుకోలేదు…ఆ తర్వాత టైంలో…

చేసిన సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు…ఇక రీసెంట్ టైంలో నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీలో స్పెషల్ రోల్ చేసినా పెద్దగా పేరు రాలేదు…ఇక తన అప్ కమింగ్ మూవీస్ లో ఇప్పుడు ఓ సాలిడ్ కంబ్యాక్ కి సెట్ అయ్యే కాన్సెప్ట్ తో గ్రాండ్ రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్నట్లు టాలీవుడ్ లో స్ట్రాంగ్ గా బజ్ అయితే వినిపిస్తుంది….

వింటేజ్ రాజశేఖర్ ను గుర్తు చేస్తూ ఓ భారీ గ్యాంగ్ స్టర్ డ్రామా రాజశేఖర్ చేయబోతున్నారట. రాజేంద్రప్రసాద్ తో సేనాపతి, జేడి చక్రవర్తి తో దయ లాంటి ఇంటెన్స్ వెబ్ సిరీస్ లు తీసిన డైరెక్టర్ పవన్ సాదినేని డైరెక్షన్ లో రాజశేఖర్ తో ఈ సినిమా ఉండబోతుంది అని సమాచారం…

హీరోయిన్స్ లేకుండా సాంగ్స్ లేకుండా కేవలం యాక్షన్ సీన్స్ తోనే నిండిపోయే ఈ సినిమా వింటేజ్ రాజశేఖర్ ను గుర్తు చేస్తూ తెరకెక్కే సినిమా అని అంటున్నారు…. చాలా టైంగా హిట్ అండ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న రాజశేఖర్ కి ఈ సారి అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాతో మంచి కంబ్యాక్ సొంతం అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు…మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here