ఈ ఇయర్ ఫస్టాఫ్ లో రిలీజ్ కావాల్సిన అనేక సినిమాలు ఎలక్షన్స్ వలన వరుస పెట్టి పోస్ట్ పోన్ అయ్యాయి. దాంతో సెకెండ్ ఆఫ్ ఇప్పుడు చాలా టైట్ గా మారిపోయింది. సెకెండ్ ఆఫ్ లో కూడా కొన్ని సినిమాలు అనుకున్న టైంకి వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తూ ఉండగా వాటిలో ముఖ్యంగా ప్రజెంట్ ఎలక్షన్స్ లో…
చాలా బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన అప్ కమింగ్ మూవీస్ అన్నింటినీ హోల్డ్ లో పెట్టాడు, ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్ లను బట్టి ఈ సినిమాల షూటింగ్ లు ఎప్పుడు మొదలు అవుతాయి అన్నది క్లారిటీ వస్తుంది…. కాగా తన అప్ కమింగ్ మూవీస్ లో కొత్త సినిమా OG – They Call Him OG సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్నట్లు అనౌన్స్ చేశారు కానీ…
ఇప్పుడు ఆ డేట్ కి వచ్చే అవకాశం కొంచం తక్కువే అని అంటున్నారు. ఇక సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ దేవర(Devara Part 1) మూవీ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు దసరాకి రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు… అక్టోబర్ 10న సినిమా రిలీజ్ కానుందని చెప్పినప్పటికీ…
రీసెంట్ టైంలో దసరా రిలీజ్ లు అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం లేదు, దాంతో పాటు పాన్ ఇండియా వైడ్ గా ఆ టైంకి పోటి ఉండే అవకాశాలు ఉండటంతో సోలో రిలీజ్ కోసం శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇప్పుడు అక్టోబర్ 10 కన్నా ముందు…
సెప్టెంబర్ 27నే ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుందని సమాచారం. ఆ టైంలో రిలీజ్ అయితే పాన్ ఇండియా రేంజ్ లో సోలో రిలీజ్ దక్కే అవకాశం ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు సాలిడ్ గా నమోదు చేయోచ్చు అంటున్నారు. ఇక OG మూవీ కొత్త డేట్ కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. త్వరలోనే దీనిపై మరింత క్లారిటీ వస్తుంది.