Home న్యూస్ 5.19 తో మొదలయ్యి 33 తో దేవర రచ్చ….64తో టైగర్ భీభత్సం!

5.19 తో మొదలయ్యి 33 తో దేవర రచ్చ….64తో టైగర్ భీభత్సం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ దసరాకి రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివ(Koratala Siva) ల కాంబోలో వస్తున్న సెన్సేషనల్ మూవీ దేవర(Devara Part 1 Movie) నుండి రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా సినిమా నుండి ఫియర్ సాంగ్(Fear Song -Devara Part 1) ను రిలీజ్ చేశారు…

ఎన్టీఆర్ – అనిరుద్ ల క్రేజీ కాంబో హైప్ కి తగ్గట్లు సాంగ్ బాగానే మెప్పించినా ఇనీషియల్ రికార్డులను అయితే క్రియేట్ చేయలేదు…కానీ అందరిలో సాంగ్ స్లో అండ్ స్టడీగా మంచి రీచ్ ను సొంతం చేసుకుంటుంది అనుకోగా అనుకున్నట్లే సాంగ్ మెల్లిమెల్లిగా జోరు చూపిస్తూ లాంగ్ రన్ లో మంచి జోరుని చూపిస్తుంది…

మొదటి రోజు కేవలం 5.19 మిలియన్ వ్యూస్ ను అందుకోగా రెండో రోజు 13.50 మిలియన్ వ్యూస్ ను మూడో రోజు 7.31 మిలియన్ వ్యూస్ ని ఇలా స్టడీగా జోరు చూపిస్తూ 6 రోజులకు పైగా టైం తీసుకుని ఆల్ మోస్ట్ 33 మిలియన్ వ్యూస్ దాకా అందుకుని రీసెంట్ పాన్ ఇండియా మూవీస్ ఫస్ట్ సాంగ్స్ లో బెస్ట్ వ్యూస్ తో ట్రెండ్ అవుతున్న సాంగ్ గా నిలిచింది.

ఇక ఈ సాంగ్ కి 6 రోజుల్లో తెలుగు లో 33 మిలియన్స్ లోపు వ్యూస్ హిందీలో 19.5 మిలియన్స్ కి పైగా వ్యూస్, తమిళ్ లో 6.2 మిలియన్ వ్యూస్ ని కన్నడలో 3.7 మిలియన్ వ్యూస్ ని మలయాళంలో 2 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని అందుకోగా టోటల్ గా 6 రోజుల్లో 64.5 మిలియన్ వ్యూస్ తో అన్ని చోట్లా కూడా…

రీసెంట్ పాన్ ఇండియా మూవీస్ సాంగ్స్ తో పోల్చితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. సాంగ్ ఇతర సినిమాల మాదిరిగా డ్యూయెట్ లేదా మాస్ ఇంట్రో సాంగ్ ఏమి కాదు, అయినా కూడా సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకు పోతూ ఇప్పుడు రీసెంట్ పాన్ ఇండియా మూవీస్ ఫస్ట్ సాంగ్ టోటల్ వ్యూస్ ని క్రాస్ చేయడానికి సిద్ధం అవుతుంది ఈ సాంగ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here