Home న్యూస్ 2nd డే లవ్ మీ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అప్ డేట్!

2nd డే లవ్ మీ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అప్ డేట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆశిష్(Ashish) హీరోగా నటించిన లవ్ మీ(Love Me Movie) మూవీ ట్రైలర్ క్లిక్ అయినా సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ అయితే సొంతం అయ్యింది, సోషల్ మీడియాలో సినిమా టాక్ గట్టిగానే స్ప్రెడ్ అయింది అని చెప్పాలి.

మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కోటి రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా మేకర్స్ 4.5 కోట్లు అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు కానీ అది పబ్లిసిటీ కోసం చేసిన పోస్టరే కానీ ట్రేడ్ లెక్కల్లో 2.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను మొదటి రోజు అందుకున్న లవ్ మీ మూవీ ఓవరాల్ గా ప్రజెంట్ పరిస్థితులలో మంచి ఓపెనింగ్స్ నే అందుకుంది.

ఇక రెండో రోజులో అడుగు పెట్టిన సినిమా సండే అడ్వాంటేజ్ తో మాస్ సెంటర్స్ లో కొంచం పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేయగా నైట్ షోలటైం కి IPL ఫైనల్ మ్యాచ్ ఇంపాక్ట్ వలన కొంచం డ్రాప్స్ ఉన్నా కూడా ఉన్నంతలో రెండో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 45-50 లక్షల దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ ఫైనల్ మ్యాచ్ ఇంపాక్ట్ ఉండటంతో ఎంతవరకు హోల్డ్ చేస్తుందో చూడాలి. మొత్తం మీద 2 రోజుల షార్ట్ వీకెండ్ లో సినిమా పర్వాలేదు అనిపించేలానే పెర్ఫార్మ్ చేసింది అని చెప్పాలి. ఇక ఓవరాల్ గా 2 రోజులకు గాను సినిమా సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here