రీసెంట్ టైంలో టాలీవుడ్ క్రేజీ సినిమాల పాటలు డే 1 కన్నా కూడా డే 2 సాలిడ్ గా రచ్చ లేపుతుంది. వ్యూస్ లేట్ గా అప్ డేట్ అవ్వడం ఒక రీజన్ కావొచ్చు, డే 2 ఎక్కువ మందికి యూట్యూబ్ సజెస్ట్ చేస్తూ ఉండొచ్చు మొత్తం మీద డే 2 సాలిడ్ రెస్పాన్స్ తో వ్యూవర్ షిప్ సొంతం అవుతూ ఉండటం విశేషం. లేటెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న…
పాన్ ఇండియా మూవీ పుష్ప2 ది రూల్(Pushpa 2 The Rule Movie) సినిమా నుండి రెండో సాంగ్ అయిన సూసేకి(#SOOSEKI(The Couple Song)#Pushpa2) సాంగ్ ను రిలీజ్ చేశారు, మొదటి 24 గంటల్లో వచ్చిన వ్యూస్ కి ఆల్ మోస్ట్ రెండు రెట్లు ఎక్కువగా వ్యూస్ ను రెండో రోజు సొంతం చేసుకుని ఈ సాంగ్ మాస్ రచ్చ చేసింది ఇప్పుడు.
మొదటి 24 గంటల్లో ఈ సాంగ్ కి 10.97 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా 522.2K లైక్స్ సొంతం అయ్యాయి. ఇక రెండో రోజుకి వచ్చే సరికి ఏకంగా 18 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ 2 రోజుల్లో 29 మిలియన్స్ వ్యూస్ ను అందుకుని ఈ సాంగ్ దుమ్ము లేపగా చాలా వరకు మొదటి రోజు వ్యూస్ రెండో రోజు అప్ డేట్ అయినట్లు ఉన్నాయి.
ఇక లైక్స్ పరంగా రెండో రోజు 72 వేల లైక్స్ సొంతం అవ్వగా ఓవరాల్ గా అల్లు అర్జున్ మాస్ పవర్ ను చూపెడుతూ రెండో సాంగ్ తో కూడా దుమ్ము లేపే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుని సినిమా మీద ఉన్న అంచనాలను పెంచేశాడు. ఇక ఈ సాంగ్ లాంగ్ రన్ భారీగా వైరల్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.