Home న్యూస్ కల్కి నైజాం @ 400….ఇక చూస్కోండి…రికార్డుల జాతర!

కల్కి నైజాం @ 400….ఇక చూస్కోండి…రికార్డుల జాతర!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు ఈ నెల 27 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఆల్ రెడీ సినిమా మీద అన్ని చోట్ల అంచనాలు సాలిడ్ గా ఉండగా తెలుగు రాష్ట్రాలలో మాత్రం సినిమా మీద…

అంచనాలు మరో లెవల్ లో ఉన్నాయి…దానికి కారణం కొంత గ్యాప్ తర్వాత రిలీజ్ కాబోతున్న బిగ్గెస్ట్ మూవీ ఇదే కాగా ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ విత్ మైతలాజిక్ కనెక్షన్ తో వస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి సినిమా మీద. దాంతో కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ లేపే అవకాశం ఎంతైనా ఉన్న ఈ సినిమా…

ఇప్పుడు బిజినెస్ పరంగా ఆల్ రెడీ అద్బుతాలు సృష్టిస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో భారీ టికెట్ హైక్స్ కూడా ఈ సినిమాకి సొంతం కాబోతున్నాయి. ఇక ఆ రేట్స్ కి ఫుల్ న్యాయం చేసేలా భారీ ఎత్తున సినిమాను ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. నైజాంలో సినిమా కి డిమాండ్ భారీగానే ఉండటంతో ఇప్పుడు…

సినిమా రిలీజ్ టైంకి ఇక్కడే 400 కి పైగా థియేటర్స్ లో సినిమా రిలీజ్ కాబోతుందని అంటున్నారు. అంటే ఆల్ మోస్ట్ 95% వరకు థియేటర్స్ లో కల్కి మూవీనే ఉండబోతుంది…టాక్ బాగుంటే మాత్రం షో షోకి కలెక్షన్స్ పరంగా సినిమా సంచలన రికార్డులతో ఊచకోత కోయడం ఖాయమని చెప్పాలి. ఫైనల్ థియేటర్స్ నంబర్ రిలీజ్ టైం కి తెలియనుండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా…

ఓపెనింగ్స్ నుండే మాస్ ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఈ ఇయర్ టాలీవుడ్ లో పెద్దగా హిట్ మూవీస్ ఫస్టాఫ్ లో రాలేదు, 2 హిట్స్ తర్వాత కంప్లీట్ గా అండర్ పెర్ఫార్మ్ చేసిన టాలీవుడ్ ఫస్టాఫ్ కి కల్కి మూవీ గ్రాండ్ ఎండ్ ఇచ్చే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here