Home న్యూస్ 100 కోట్ల కన్నప్ప టీసర్ రివ్యూ….విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్…కానీ!!

100 కోట్ల కన్నప్ప టీసర్ రివ్యూ….విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్…కానీ!!

0

కెరీర్ ని ఎప్పుడో మొదలు పెట్టినా కూడా ఆశించిన మేర సక్సెస్ లేని హీరోలలో మంచు విష్ణు(Manchu Vishnu) ఒకరు…కెరీర్ లో ఢీ, దేనికైనా రెడీ, దూసుకేల్తా లాంటి కొన్ని సినిమాలు తన కెరీర్ కి మంచి బూస్టప్ ఇచ్చినా కూడా తర్వాత చేసిన సినిమాల విషయంలో తప్పులు చేసిన మంచు విష్ణు కెరీర్ లో చాలా డౌన్ అయిపోయాడు..ఇలాంటి టైంలో తన కెరీర్ లోనే…

ఆల్ మోస్ట్ హైయెస్ట్ బడ్జెట్ తో చేస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప(Kannappa Movie) తో బిగ్గెస్ట్ కంబ్యాక్ కి సిద్ధం అవుతున్న మంచు విష్ణు ఈ సినిమా కోసం ఆల్ మోస్ట్ 100 కోట్ల మమ్మోత్ బడ్జెట్ పెట్టి సినిమాను తీస్తూ ఉండగా చాలా మంది స్టార్స్ సినిమాలో స్పెషల్ రోల్స్ చేస్తూ ఉండటంతో సినిమా మీద అంచనాలు అయితే భారీగా పెరిగి పోయాయి.

ఇక ఇప్పుడు సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా టీసర్ చూసిన తర్వాత క్వాలిటీ పరంగా మాత్రం చాలా రిచ్ గా అనిపిస్తున్న కన్నప్ప మూవీ కథ ఎలా ఉంటుంది అన్నది మాత్రం చెప్పలేదు…వాయు లింగాన్ని ద్వంసం చేయడానికి వచ్చిన వందల మందిని కన్నప్ప ఒక్కడే చంపేస్తాడు…దాంతో వచ్చిన విలన్ గ్రూప్ అన్న అయిన మెయిన్ విలన్ హీరో మీద…

పగ తీర్చుకోవాలి అనుకుంటారు…ఇలాంటి టైములో అందరి తో యుద్ధం చేస్తున్నా హీరో ఆపదల్లో ఉన్న టైంలో మహా శివుడు, నందీశ్వరుడు స్వయంగా ఎలా హెల్ప్ చేశారు ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా కథగా అనిపిస్తుంది…. టీసర్ లో మంచు విష్ణు లుక్స్ పర్వాలేదు అనిపించగా యాక్షన్ సీన్స్ ఎక్కువగా చూపించారు…

ఇక శివుడిగా అక్షయ్ కుమార్, నందీశ్వరుడిగా ప్రభాస్ నటిస్తూ ఉండటంతో టీసర్ లో ఆ షాట్స్ అన్నీ హైలెట్ గా అనిపించాయి…కానీ ఓవరాల్ గా టీసర్ చూసిన తర్వాత కొన్ని సీన్స్ శక్తి సినిమాని గుర్తు చేసినట్లు అనిపించాయి… ఓవరాల్ గా కన్నప్ప సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే విష్ణు కెరీర్ టర్నింగ్ పాయింట్ అవ్వొచ్చు…

కన్నప్ప నావెల్ నుండి తీసుకుని చెబుతున్న ఈ కథలో జస్ట్ ఇంట్రోగా యాక్షన్ కట్ టీసర్ రిలీజ్ చేశారు అనుకోవచ్చు…. ఈ సినిమా మీదే బోలెడు ఆశలు పెట్టుకున్న మంచు విష్ణుకి కన్నప్ప మూవీ ఎలాంటి బూస్టప్ ఇస్తుందో చూడాలి ఇక. ఇక టీసర్ కి 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here