బాహుబలి సిరీస్ తర్వాత తెలుగు సినిమా మార్కెట్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది…అందరు స్టార్స్ దాదాపుగా పాన్ ఇండియా మూవీస్ ని చేస్తూ ఉండగా రీజనల్ మూవీస్ తగ్గిపోతున్నాయి. అదే టైంలో పాన్ ఇండియా మూవీస్ వలన బిజినెస్ లు మాత్రం సాలిడ్ గా జరుగుతూ ఉండగా రెండేళ్ళ క్రితం వచ్చిన మమ్మోత్ మూవీ అయిన RRR Movie….
రికార్డ్ బిజినెస్ అండ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా తర్వాత వచ్చిన మూవీస్ లో ప్రభాస్(Prabhas) సినిమాలే ఎక్కువగా బిజినెస్ పరంగా ఫుల్ డామినేషన్ ని చూపించాయి. అవి ఏ రేంజ్ లో అంటే ప్రస్తుతం రిలీజ్ కాబోతున్న బిగ్ పాన్ ఇండియా మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) తో కలిపి ఇప్పుడు….
అక్షరాలా 1410 కోట్లు….చరిత్రలో ఒకే ఒక్కడు సామి!!
ఆల్ టైం హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ లు అందుకున్న మూవీస్ లో ప్రభాస్ వి ఏకంగా టాప్ 10 లో 6 సినిమాలు ఉండటం విశేషం, టాప్ ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ ఉండగా రెండో ప్లేస్ నుండి 7వ ప్లేస్ వరకు కూడా కంప్లీట్ గా ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ తో ఫుల్ డామినేషన్ ని చేశాడు…
ఒకసారి టాలీవుడ్ లో ఆల్ టైం హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ లను అందుకున్న సినిమాలను గమనిస్తే….
Top 10 Highest Pre Release Business Movies In Tollywood
1. RRR Movie – 451Cr
2. Kalki2898AD – 370CR*****
3. Baahubali2 – 352cr
4. Salaar – 345CR
5. Saaho – 270cr
6. ADI PURUSH – 240CR
7. Radhe Shyam – 202.80Cr
8. SyeRaa Narasimha Reddy- 187.25Cr
9. Pushpa Part 1: 144.9CR
10. GunturKaaram – 132.00CR
11. Acharya – 131.20CR
సౌత్ మూవీస్ డే 1 టాప్ 10 గ్రాసింగ్ మూవీస్ లిస్ట్!
మొత్తం మీద టాప్ 1 లో 9 సినిమాలు పాన్ ఇండియా సినిమాలే కాగా గుంటూరు కారం ఒక్కటి రీజనల్ మూవీ గా నిలిచింది. ఇక ఈ ఇయర్ ఎండ్ అలాగే అప్ కమింగ్ టైం వరకు చూసుకుంటే ఇంకా చాలా సినిమాలే రిలీజ్ కాబోతూ ఉండటంతో ఈ లిస్టులోకి ఎంటర్ అయ్యే సినిమాల సంఖ్య…
ఇంకా పెరిగే అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. అదే టైంలో ఈ రికార్డ్ బిజినెస్ ను రికవరీ చేసిన సినిమాలు కొన్నే ఉన్నాయి, అప్ కమింగ్ టైంలో కూడా భారీ బిజినెస్ లను సైతం రికవరీ చేసే సినిమాలు చాలా రావాలని కోరుకుందాం…..