అప్పట్లో సోషల్ మెసేజ్ మూవీస్ కి పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించి తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఇండియాలోనే బెస్ట్ డైరెక్టర్స్ లో ఒకడిగా దూసుకు పోయిన శంకర్ డైరెక్షన్ లో చేసిన భారతీయుడు సినిమా అప్పట్లో ఒక సంచలనం…..ఆ సినిమా కాన్సెప్ట్ నే తర్వాత చాలా సినిమాలకు వాడారు, అలా ఆ కాన్సెప్ట్ చాలా రొటీన్ అయిపొయింది ప్రజెంట్ టైంలో…
ఇలాంటి టైంలో భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు2(Bharateeyudu2 Movie) ను తీస్తున్న శంకర్ ఎప్పుడో సినిమాను రిలీజ్ చేయాల్సింది కానీ అనేక సార్లు డబ్బులు లేక షూటింగ్ డిలే వలన ఆగిపోయిన ఈ సినిమా తిరిగి లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) విక్రంతో బ్లాక్ బస్టర్ కొట్టడంతో మళ్ళీ స్టార్ట్ అవ్వగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు…
ఈ జులై 12న రిలీజ్ కాబోతూ ఉండగా రీసెంట్ గా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత శంకర్ సినిమాలు ఇష్టం ఉన్న చాలా మంది ఇది అసలు శంకర్ డైరెక్షన్ లోనే తెరకెక్కిన సినిమా నా అన్న అనుమానాలు రేకెత్తించాయి. శంకర్ సినిమాలు అంటే ఉండే వావ్ ఫ్యాక్టర్ అసలు ఏ కోశానా కూడా భారతీయుడు2 ట్రైలర్ లో కనిపించలేదు…
కథ పాయింట్ ప్రజెంట్ అరిగిపోయిన పాయింటే….ప్రస్తుతం సమాజంలో అవనీతి, లంచగొండితనం ఓ రేంజ్ లో పెరిగిపోయిన నేపధ్యంలో తిరిగి భారతీయుడు వస్తే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను మరీ ఫాస్ట్ ఫేజ్ తో కట్ చేయగా అనిరుద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేక పోయింది….
ఇక కమల్ హాసన్ లుక్ కొన్ని చోట్ల బాగుండగా కొన్ని చోట్ల అంతగా సెట్ అవ్వలేదు అనిపించింది… ఓవరాల్ గా ట్రైలర్ సినిమా మీద అంచనాలు ఎంత తగ్గించుకుని థియేటర్స్ కి వెళితే అంత మంచింది అనిపించేలా ఉంది… కానీ శంకర్ సినిమాలు అంటే మినిమమ్ గ్యారెంటీ అనిపించేలా ఉంటాయి కాబట్టి…
సినిమా రిలీజ్ అయిన తర్వాత రొటీన్ కథలానే అనిపిస్తున్నా ఆడియన్స్ ను అలరించేలా సినిమా ఉంటే మట్టుకు శంకర్ కమల్ హాసన్ ల స్టార్ పవర్ తో పాన్ ఇండియా రేంజ్ లో మంచి జోరునే సినిమా చూపించే అవకాశం ఉంటుంది…. మరి సినిమా ఎంతవరకు అంచనాలను థియేటర్స్ లో అందుకుంటుందో చూడాలి.