Home న్యూస్ 91 కోట్లు ఔట్….ఆల్ టైం రికార్డులతో మహారాజ రాంపెజ్!

91 కోట్లు ఔట్….ఆల్ టైం రికార్డులతో మహారాజ రాంపెజ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా వచ్చిన లేటెస్ట్ మూవీ మహారాజ(Maharaja Movie) అన్ని చోట్లా యునానిమస్ రివ్యూలను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా కూడా ప్రతీ రోజు మంచి జోరుని చూపిస్తూ దూసుకు పోయింది…

దాంతో విజయ్ సేతుపతి కెరీర్ లో సోలో హీరోగా బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలిచిన ఈ సినిమా ఇప్పటికీ ఏమాత్రం జోరు తగ్గకుండా విజయ్ సేతుపతి కెరీర్ లో కొత్త బెంచ్ మార్క్ లను నమోదు చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

సినిమా కి పోటిగా ఇప్పుడు మమ్మోత్ కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగడంతో ఇక మహారాజ స్లో అయ్యే అవకాశం ఎక్కువగా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 13వ రోజున మరోసారి మంచి జోరుని చూపించి 21 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది…

దాంతో టోటల్ గా తెలుగు లో 13 రోజులు పూర్తి అయ్యే టైంకి సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Maharaja(Telugu) 13 Days Total Collections
👉Nizam: 3.10CR~
👉Ceeded: 0.95CR~
👉Andhra: 2.20CR~
AP-TG Total:- 6.25CR(12.70CR~ Gross)
3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 2.75 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా..

ఇక సినిమా 13 రోజుల్లో వరల్డ్ వైడ్ గా మమ్మోత్ 90 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి విజయ్ సేతుపతి కెరీర్ లో మరో రికార్డ్ ను నమోదు చేసింది. ఒకసారి ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
Maharaja 13 Days Total World Wide Collections
👉Tamilnadu – 42.20Cr
👉Telugu States- 12.70Cr
👉Ka+ROI – 12.45Cr
👉Overseas – 23.90Cr***
Total WW collection – 91.25CR(44.25CR~ Share) Approx

21 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 23.25 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు కల్కి హవాని తట్టుకుని టోటల్ రన్ లో 100 కోట్ల మార్క్ ని అందుకుంటుందో లేదో అన్నది ఆసక్తిగా మారింది ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here