Home న్యూస్ హిందీలో ఇదేం ఊపు సామి…ఎవ్వరూ ఊహించని భీభత్సం ఇది!!

హిందీలో ఇదేం ఊపు సామి…ఎవ్వరూ ఊహించని భీభత్సం ఇది!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా హిందీలో మంచి జోరునే చూపించాయి ఒక్క రాదే శ్యామ్ తప్ప..ఆ ఒక్క సినిమా మినహా మిగిలిన సినిమాలు అన్నీ మంచి జోరుని చూపించగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో వచ్చిన కల్కి మూవీ….

అసలు ఎలాంటి ప్రమోషన్స్ ను పెద్దగా జరుపుకోలేదు. హిందీలో ఎదో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తప్పితే సినిమాకి హిందీలో అసలు ప్రమోషన్స్ జరగలేదు. దాంతో హిందీలో సినిమా ఓపెనింగ్స్ ని ఎవ్వరూ పెద్దగా ఎక్స్ పెర్ట్ చేయడం లేదు అన్న పొజిషన్ నుండి ట్రైలర్ ల రిలీజ్ తర్వాత…

సినిమా మీద హైప్ పెరగడం మొదలు అయినా హిందీలో ప్రమోషన్స్ అస్సలే లేకపోవడంతో కల్కి మహా అయితే 10-12 కోట్ల రేంజ్ లో ఓపెన్ అవ్వొచ్చు ఏమో అంటూ అందరూ ఎక్స్ పెర్ట్ చేశారు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ కాబోతుంది… హిందీలో మాస్ స్టేషన్స్ లో ప్రభాస్ కి సాలిడ్ ఫాలోయింగ్ ఏర్పడగా…

మాస్ సెంటర్స్ లో ఈ ఇయర్ బాలీవుడ్ మూవీస్ పరంగా హైయెస్ట్ ఓపెనర్ గా నిలిచిన హృతిక్ రోషన్ ఫైటర్ మూవీకి ధీటుగా కల్కి బుకింగ్స్ ఉన్నాయని తెలుస్తుంది….క్లాస్ సెంటర్స్ లో సైతం మంచి బుకింగ్స్ ని షో షోకి సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న కల్కి మూవీ…

ఇప్పుడు హిందీలో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అందరి అంచనాలను మించిపోయే అవకాశం ఎంతైనా ఉందని అంచనా వేస్తున్నారు…ఇనీషియల్ గా 20 కోట్ల రేంజ్ లో ఓపెన్ అవ్వొచ్చు అని చెబుతూ ఉండగా నైట్ షోలకు ఓవరాల్ గా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా దుమ్ము లేపితే…

ఈ అంచనాలను సైతం సినిమా మించిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉండటం విశేషం. మొత్తం మీద హిందీలో మినిమమ్ ఓపెనింగ్స్ వస్తే గొప్పే అని అనుకున్న స్టేజ్ నుండి ఇప్పుడు ఏకంగా ఈ ఇయర్ హిందీ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకోవడానికి కల్కి మూవీ సిద్ధం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here