Home న్యూస్ స్టార్ట్ కాస్ట్ కూడా తెలియని సినిమా….20 రోజుల్లో ఈ కలెక్షన్స్ ఏంటి సామి!

స్టార్ట్ కాస్ట్ కూడా తెలియని సినిమా….20 రోజుల్లో ఈ కలెక్షన్స్ ఏంటి సామి!

0

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ లో వచ్చిన సినిమాల్లో ఆడియన్స్ ను అలరించిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పాలి. కొన్ని పెద్ద సినిమాలు భారీ ఆశలు పెట్టుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ లను సొంతం చేసుకోగా రీసెంట్ గా జస్ట్ ట్రైలర్ తోనే అంచనాలు ఏర్పడేలా చేసిన…

ముంజ్య(Munjya Movie) అనే సినిమా, అసలు స్టార్ కాస్ట్ ఎవరు ఉన్నారో కూడా పెద్దగా తెలియకపోయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా మొదటి వీకెండ్, తర్వాత మొదటి వీక్, తర్వాత రెండో వీక్ ఇలా ప్రతీ వారం జోరు చూపించి మూడో వీక్ వర్కింగ్ డేస్ లో కూడా…

సెన్సేషనల్ హోల్డ్ ని చూపిస్తూ ఇప్పుడు లాస్ట్ 3 రోజులుగా ప్రతీ రోజూ 2.5 కోట్లకు తగ్గకుండా నెట్ కలెక్షన్స్ ని అందుకుంటూ ఇప్పుడు 20 రోజులు పూర్తి అయ్యే టైంకి 94.75 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని ఇండియాలో సొంతం చేసుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది…

ఇప్పటికీ సినిమా ఎక్స్ లెంట్ గా జోరుని చూపిస్తూ ఉండగా కల్కి మూవీని తట్టుకుని కూడా ఇప్పుడు డీసెంట్ థియేటర్స్ ని ఈ వీక్ కి గాను హోల్డ్ చేసిన ఈ సినిమా 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. మరి ఆ మార్క్ ని దాటేసి ఇంకా ఎంత దూరం సినిమా వెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here