పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) వరల్డ్ వైడ్ గా భారీ అంచనాల నడుమ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది…. పెద్దగా ప్రమోషన్స్ లాంటివి జరగకపోయినా కూడా ప్రభాస్ స్టార్ డం పవర్ ను చూపెడుతూ రిలీజ్ కి ముందు నుండే ప్రీ టికెట్ సేల్స్ తో రికార్డులను క్రియేట్ చేసిన ఈ సినిమా…
ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో ఓపెనింగ్స్ ను అందుకోబోతుంది. ఆల్ రెడీ ఓవర్సీస్ లో రికార్డ్ కలెక్షన్స్ ని అందుకోబోతున్న ఈ సినిమా ప్రీమియర్స్ నుండే కొత్త రికార్డులను నమోదు చేస్తూ ఉండగా మొదటి రోజు ఓవర్సీస్ నుండే 30 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పుడు…
Prabhas Kalki 2898 AD 1st Day Box Office Collections Report
ఇక తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము లేపుతున్న ఈ సినిమా నైజాంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోబోతుండగా మొదటి రోజు బుకింగ్స్ చాలా చోట్ల సలార్ మరియు ఆర్ ఆర్ ఆర్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉండగా కొన్ని చోట్ల లీడ్ కూడా ఉంది… ఇక ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో మంచి జోరునే చూపిస్తూ ఉన్న సినిమా సీడెడ్ లో సలార్ కన్నా కొంచం వెనకబడి ఉందని పించేలా బుకింగ్స్ ఉండగా ఫైనల్ డే 1 కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.
అయినా కూడా ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 46-48 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 50 కోట్లు ఆ పైన షేర్ ని అందుకునే అవకశం ఉంది. ఇక హిందీలో సినిమా అంచనాలను మించి పోయే రేంజ్ లో జోరుని చూపిస్తూ దూసుకు పోతూ ఉండగా అక్కడ 10 కోట్లకు పైగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
Kalki 2898 AD 1st Day Collections Report
కర్నాటక, తమిళ్, కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 10 కోట్లు ఆ పైన షేర్ ని అందుకునేలా కనిపిస్తుంది. దాంతో టోటల్ గా మొదటి రోజు సినిమా వరల్డ్ వైడ్ గా 100 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక అంచనాలను మించిపోతే ఈ లెక్కని కూడా మించిపోవచ్చు..
ఓవరాల్ గా మొదటి రోజున సినిమా అన్ని చోట్లా అంచనాలను మించే అవకాశమే ఎక్కువగా ఉండగా, నైట్ షోలకు వరల్డ్ కప్ సెమీ ఫైనల్ వలన కొంచం ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉండగా అది ఎక్కువగా ఉంటే ఈ లెక్కకి కొంచం అటూగా షేర్ ని సినిమా అందుకోవచ్చు. ఇక ఫస్ట్ డే సినిమా అఫీషియల్ గా సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి…