Home న్యూస్ హిందీ గడ్డ మీద ఈ రోజు ప్రభాస్ రికార్డ్…బాహుబలి తర్వాత మళ్ళీ ఇప్పుడు!!

హిందీ గడ్డ మీద ఈ రోజు ప్రభాస్ రికార్డ్…బాహుబలి తర్వాత మళ్ళీ ఇప్పుడు!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) కి తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో మంచి మార్కెట్ ను బాహుబలి(Baahubali ) సిరీస్ సొంతం అయ్యేలా చేసింది. ఆ సినిమా తర్వాత చేసిన సినిమాలు అన్నింటిలో ఒక్క రాధే శ్యామ్ మాత్రమే అన్ని చోట్లా నిరాశ పరిచింది…

ఇక హిందీలో సౌత్ హీరోలు ఎవ్వరికీ సాధ్యం కాని మాస్ మార్కెట్ ను సొంతం చేసుకున్న రెబల్ స్టార్ రాధే శ్యామ్ ని పక్కకు పెడితే మిగిలిన అన్ని సినిమాలతో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకోగా తన లాస్ట్ మూవీ సలార్(Salaar) భారీ క్లాష్ లో సైతం హిందీలో జోరు చూపించి టోటల్ రన్ లో…

153.45 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా అంతకన్నా ముందు ఆదిపురుష్(Adipurush) ఎపిక్ ట్రోల్స్ తో కూడా టోటల్ రన్ లో 143.25 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా ప్రభాస్ లేటెస్ట్ మూవీ అయిన కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే…

రిమార్కబుల్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు 10 రోజుల్లో ఆల్ మోస్ట్ 190 కోట్ల లోపు నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది. ఇక 11వ రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో మరింత జోరు చూపించ బోతున్న కల్కి మూవీ ఇప్పుడు…

ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో హిందీలో ప్రతిష్టాత్మక 200 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోబోతుంది…..బాహుబలి2 తర్వాత ప్రభాస్ కెరీర్ లో ఇది హిందీలో రెండో 200 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమాగా కల్కి నిలవబోతుంది…సౌత్ లో ఎవ్వరికీ లేని రికార్డ్ ఇదని చెప్పాలి ఇప్పుడు…

అప్పట్లో సాహోతోనే ఈ మార్క్ ని అందుకుంటాడు అని అని అందరూ అనుకున్నా ఎప్పటికప్పుడు మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకోవడం వలన అనుకున్న రేంజ్ లో జోరు చూపించలేదు…కానీ ఇప్పుడు కల్కి మూవీ పాజిటివ్ టాక్ పవర్ తో 200 కోట్లు దాటేసి ఫైనల్ రన్ లో హిందీలో ఎలాంటి కలెక్షన్స్ తో రచ్చ లేపుతుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here