ఈ ఇయర్ టాలీవుడ్ కి అంతగా కలిసి రాలేదు…టోటల్ 6 నెలల్లో రిలీజ్ అయిన మూవీస్ లో కొన్ని సినిమాలు మాత్రమే అంచనాలను అందుకున్నాయి. పెద్దగా స్టార్స్ నటించిన సినిమాలు రిలీజ్ అవ్వకపోవడం వలన సమ్మర్ పూర్తిగా వృధా అయిపొయింది…ఉన్నంతలో హనుమాన్(Hanuman Movie), టిల్లు స్క్వేర్(Tillu Square Movie) మరియు…
లేటెస్ట్ గా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) మంచి జోరుని చూపించి ఎంతో కొంత టాలీవుడ్ కి ఊపిరి పోసింది అని చెప్పాలి…ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద కంటిన్యూగా కోటికి తగ్గకుండా షేర్ ని అందుకున్న…
సినిమాల పరంగా కల్కి మూవీ టికెట్ హైక్స్ ని తగ్గించకపోవడంతో రెండో వీక్ వర్కింగ్ డేస్ లో భారీగా స్లో డౌన్ అవ్వగా 14వ రోజు కోటి లోపు షేర్ ని అందుకుని మొత్తం మీద 13 రోజులు తెలుగు రాష్ట్రాల్లో కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకోగా…ఓవరాల్ గా ఈ ఇయర్ టాలీవుడ్ లో రిలీజ్ అయిన…
సినిమాల పరంగా ఈ ఇయర్ చిన్న సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్ మూవీ మమ్మోత్ కలెక్షన్స్ తో ఊచకోత కోసి ఏకంగా 20 రోజుల పాటు నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా తర్వాత ప్లేస్ లో ఇప్పుడు కల్కి మూవీ నిలిచింది.
ఓవరాల్ గా ఈ ఇయర్ రిలీజ్ అయిన మూవీస్ లో ఎక్కువ రోజులు కోటికి తగ్గకుండా షేర్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే…
AP TG 1cr Plus Continuous Share Movies 2024
👉#HanuMan – 20 Days(inc premieres)
👉#Kalki2898AD – 13 Days ******
👉#GunturKaaram – 10 Days
👉#TilluSquare – 10 Days
👉#NaaSaamiRanga – 6 Days
👉#Saindhav – 4 Days
👉#OmBheemBush – 4 Days
మొత్తం మీద ఈ ఇయర్ ఫస్టాఫ్ లో మరీ అనుకున్న రేంజ్ లో సినిమాలు రచ్చ చేయలేదు కానీ ఉన్నంతలో మాత్రం హనుమాన్ వీర విహారం తర్వాత కల్కి జోరు భారీగా చూపించింది. గుంటూరు కారం మరియు టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలు కూడా జోరు చూపగా ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో వచ్చే సినిమాలు ఎన్ని ఈ లిస్టులో ఎంటర్ అవుతాయో చూడాలి ఇక…