Home న్యూస్ భారతీయుడు2 అడ్వాన్స్ బుకింగ్స్ రిపోర్ట్….డే 1 ఎంత రావొచ్చు అంటే!!

భారతీయుడు2 అడ్వాన్స్ బుకింగ్స్ రిపోర్ట్….డే 1 ఎంత రావొచ్చు అంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శంకర్(Shankar) డైరెక్షన్ లో లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు2(Bharateeyudu2 Movie) సినిమా ఆడియన్స్ ముందుకు శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని చోట్లా ఓపెన్ చేయగా మంచి బుకింగ్స్ తోనే సినిమా…

జోరు చూపిస్తూ దూసుకు పోతూ ఉండగా ముందుగా తెలుగు డబ్ విషయానికి వస్తే సినిమా కమల్ హాసన్ ప్రీవియస్ మూవీ విక్రం కన్నా కూడా బెటర్ బుకింగ్స్ ను ఇప్పటి వరకు సొంతం చేసుకుని దూసుకు పోతూ ఉంది… నైజాంలో బుకింగ్స్ ట్రెండ్ సాలిడ్ గా ఉండగా ఆంధ్ర సీడెడ్ లలో…

కూడా బుకింగ్స్ జోరు బాగానే ఉంది…దాంతో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 6-8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా తర్వాత టాక్ ను బట్టి షో షో కి కలెక్షన్స్ లో గ్రోత్ ఉండొచ్చు…ఇక తమిళ్ లో బుకింగ్స్ స్లో స్టార్ట్ ను సొంతం చేసుకున్నా కూడా…

   

ఇప్పుడు మంచి జోరుని చూపిస్తూ ఉండటంతో ఓవరాల్ గా మొదటి రోజు టాక్ బాగుంటే 20-22 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద సినిమా 7-8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా….

ఓవర్సీస్ లో కూడా ఆల్ రెడీ ప్రీ సేల్స్ తోనే 1.5 మిలియన్ డాలర్స్ దాకా వసూళ్ళని అందుకున్న సినిమా ఓవరాల్ గా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 55 కోట్ల రేంజ్ నుండి 60 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి..

మొత్తం మీద టాక్ ను బట్టి సినిమా కలెక్షన్స్ అటూ ఇటూగా ఉండొచ్చు, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బిజినెస్ లెక్కలు ఇంకా క్లియర్ గా రివీల్ అవ్వలేదు కానీ ఓవరాల్ గా భారతీయుడు2 మూవీ మొదటి రోజు మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక ఫస్ట్ డే సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here