అది 1996 సంవత్సరం….సంక్రాంతి సీజన్…పోటిలో సూపర్ స్టార్ కృష్ణ(Super Star Krishna) నటించిన సాంప్రదాయం సినిమా అలాగే విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన ధర్మచక్రం లాంటి బిగ్ మూవీస్ రిలీజ్ అవ్వగా…వాటి మధ్యలో పెద్దగా అంచనాలు లేని చిన్న సినిమా అయిన పెళ్లి సందడి(Pelli Sandadi Movie) రిలీజ్ అయ్యింది…
చిన్న సినిమానే అయినా కూడా సంక్రాంతి విన్నర్ గా నిలిచి అద్బుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించి మిగిలిన పెద్ద సినిమాలను మించిన రికార్డులను క్రియేట్ చేసింది….ఈ సినిమా గురించి నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ..
తాను మరియు అల్లు అరవింద్ లు కలిసి ఓ చిన్న సినిమా చేయాలని అనుకుంటున్న టైంలో సడెన్ గా కే రాఘవేంద్రరావు గారు అలాంటి సబ్జెక్ట్ నే చెప్పడంతో చకచకా పెళ్లి సందడి సినిమా మొదలు అయ్యిందని…కేవలం 1.2 కోట్ల రేంజ్ బడ్జెట్ తోనే నిర్మించిన ఈ సినిమా కి కీరవాణి గారు అందించిన…
అద్బుతమైన మ్యూజిక్ రిలీజ్ కి ముందే హైప్ ను పెంచగా సంక్రాంతి రేసులో పెద్ద క్రేజ్ ఉన్న స్టార్స్ నటించిన సినిమాల మధ్య రిలీజ్ అయిన పెళ్లి సందడి సినిమాకి ఆడియన్స్ నుండి అద్బుతమైన రెస్పాన్స్ సొంతం అయ్యిందని…అప్పటి టికెట్ రేట్స్ దృశ్యా….
5 నుండి 30 రూపాయల మధ్యలోనే ఉండేవని…అలాంటి రేట్స్ తోనే 1.2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన పెళ్లి సందడి ఏకంగా 11.30 కోట్ల వసూళ్ళని ఆ టైంలోనే అందుకుని చిన్న సినిమాల్లో భారీ విజయాన్ని నమోదు చేసిందని…చిన్న ప్రయత్నం అంత పెద్ద విజయాన్ని అందుకోవడం…
నిర్మాతలుగా తనకి అల్లు అరవింద్ కి ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెబుతూ ఇప్పటి టికెట్ రేట్స్ లెక్కల్లో ఆ వసూళ్లు వందల కోట్ల రేంజ్ లో ఉంటుందని చెప్పుకొచ్చారు…. ఇలాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని అందుకుంటే సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ లాభాలు చాలా బాగా వస్తాయని చెప్పుకొచ్చారు అశ్వనీదత్…