కోలివుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ లో ఒకరిగా పేరున్న హీరో చియాన్ విక్రం(Chiyaan Vikram)…కానీ మిగిలిన టాప్ స్టార్స్ తో పోల్చితే ఆశించిన సక్సెస్ ను సొంతం చేసుకోలేక పోయిన విక్రమ్ ఎప్పటికప్పుడు ఎక్స్ పెరిమెంట్స్ చేయడం మాత్రం మానలేదు. లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు చాలా కష్టపడి చేసిన తంగలాన్(Thangalaan Movie Telugu Review)తో వచ్చేసిన విక్రం ఎంతవరకు మెప్పించాడో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ కి వస్తే ప్రీ ఇండిపెండెంట్స్ టైంలో ఒక ఊరిలో వ్యవసాయం చేసుకునే హీరో ఎంత కష్టపడినా శిస్తు కట్టిన తర్వాత కూడా చాలీ చాలని, సరిగ్గా తినడానికి కూడా కష్టపడుతున్న టైంలో శిస్తు కట్టలేక పోవడంతో తన పొలాన్ని జప్తు చేస్తారు…ఆ తర్వాత మరింత కష్టమైన ప్రమాదకరమైన బంగారు గనుల్లో పని చేయడానికి ఒప్పుకుంటాడు…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
విక్రమ్ ఇది వరకు ఎన్నో ప్రయోగాలు చేశాడు కానీ ఈ సినిమాలో ప్రయోగం మరో లెవల్ కి వెళ్ళిపోయింది. తన లుక్ కానీ ఆహార్యం కానీ, ఆ రోల్ కోసం విక్రం పడ్డ కష్టం కానీ ప్రతీ ఫ్రేమ్ లో కనిపించగా తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది లేదా…ది బెస్ట్ అనిపించేలా నటించాడు విక్రం….ఇక మిగిలిన రోల్స్ చేసిన వాళ్ళు కూడా పర్వాలేదు అనిపించగా…నెగటివ్ రోల్ లో మాళవిక అదరగొట్టేసింది…
సంగీతం కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ అదిరిపోయాయి…సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అదిరిపోయాయి. మరో ప్రపంచంలో మనం ఉన్నట్లు అనిపిస్తుంది సినిమా చూస్తున్నంత సేపు..ఇక్కడ వరకు అంతా బాగుంది కానీ డైరెక్టర్ పా రంజింత్ ఎంచుకున్న పాయింట్ ఎంత బాగున్నా కూడా…
చెప్పిన విధానం మాత్రం చూస్తున్న ఆడియన్స్ ను పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తూ ఎటు నుండి ఎటో వెళుతూ స్క్రీన్ ప్లే పరంగా తికమక పెడుతూ గజిబిజి చేయడంతో అద్బుతమైన పెర్ఫార్మెన్స్ కి సరైన న్యాయం జరగలేదు అనిపించింది….కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ గా కథని చెప్పినా ఇంకా చాలా బెటర్ గా ఉండేది…
కానీ స్క్రీన్ ప్లే పరంగా కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేయడంతో కొంత వరకు బాగున్నా ఓవరాల్ గా సినిమా అయిన తర్వాత విక్రమ్ పడిన కష్టానికి రావల్సినంత ఇంపాక్ట్ లేదనిపించింది….అలా కాకుండా స్క్రీన్ ప్లే పరంగా మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే ఇంకో రేంజ్ లో ఉండేది సినిమా…
అయినా కూడా విక్రం కోసం పడుతూ లేస్తూ సాగిన స్క్రీన్ ప్లే ని కొంచం పట్టి చూస్తె బాగానే మెప్పిస్తుంది తంగలాన్ మూవీ..ఎలాగూ చూసే ఆడియన్స్ పెద్దగా అంచనాలు పెట్టుకోకుండానే థియేటర్ కి వెళతారు కాబట్టి కొంచం ఓపికతో చూస్తె ఎబో యావరేజ్ లెవల్ లో అనిపిస్తుంది సినిమా…ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్…