Home న్యూస్ ఆయ్ మూవీ రివ్యూ…హాయిగా నవ్వుకోవచ్చు!

ఆయ్ మూవీ రివ్యూ…హాయిగా నవ్వుకోవచ్చు!

0

ఆగస్టు 15 వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు చాలా సినిమాలే వచ్చాయి…వాటిలో తక్కువ మందికే తెలిసిన ఆయ్(Aay Movie Review) అనే చిన్న సినిమా కూడా ఉంది…ఆగస్టు 15 ముందు రిలీజ్ ను అనౌన్స్ చేసిన సినిమాల్లో ఒకటి అయిన ఈ సినిమా తర్వాత ఇతర బిగ్ మూవీస్  రిలీజ్ ను కన్ఫాం చేసుకోవడంతో రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకుంటుంది అనుకున్నా పోటిలో ధైర్యంగా అదే రోజున రిలీజ్ చేయగా ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమి కాదు కదా అని అందరూ ఉండగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా…

ఎందుకు అంత నమ్మకంగా ఉన్నారో ఇప్పుడు సినిమా చూశాక అర్ధం అయింది అని చెప్పాలి….కథ పరంగా పెద్దగా మ్యాజిక్ ఏమి చేయకపోయినా సాదాసీదా కథకి మంచి కామెడీని కలిపి ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగేలా చేశారు టీం…ముందుగా కథ పాయింట్ కి వస్తే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన హీరో కరోనా టైంలో వర్క్ ఫ్రం హోమ్ చేయడానికి ఊరికి తిరిగి వస్తాడు…

తన చిన్ననాటి ఫ్రెండ్స్ తో కాలక్షేపం చేస్తూ తన వర్క్ చేసుకుంటూ ఉన్న టైంలో హీరోయిన్ తో లవ్ లో పడతాడు…ముందు ఓకే చెప్పినా తర్వాత వేరే అబ్బాయితో పెళ్ళికి హీరోయిన్ సిద్ధం అవుతుంది…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… చాలా నార్మల్ కథ పాయింట్ తో వచ్చిన ఆయ్ మూవీ, కథ పరంగా వీక్ అయినా కూడా…

కథనం పరంగా ఓవరాల్ గా సినిమాలో 100 కి 90% సీన్స్ మొత్తం కామెడీ సీన్స్ తోనే నింపేశారు….హీరో అండ్ ఫ్రెండ్స్ అందరూ నవ్వించడమే పనిగా పెట్టుకోవడంతో ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా సాగిన కథ చివరి 15-20 నిమిషాలు మాత్రం కొంచం సీరియస్ గా టర్న్ తీసుకుంటుంది కానీ ఓవరాల్ గా మూవీ మొత్తం కామెడీతో దుమ్ము లేపారు…

హీరోగా నార్నే నితిన్ రెండో సినిమాతో పర్వాలేదు అనిపించగా నటన కూడా ఆకట్టుకున్నాడు, కానీ హీరోని మించి రాజ్ కుమార్ కసిరెడ్డి చేసిన కామెడీ జనాలను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది….అది మీకు సినిమా చూస్తె తెలుస్తుంది….హీరోయిన్ బాగా మెప్పించగా మిగిలిన యాక్టర్స్ కూడా ఆకట్టుకున్నారు… మొత్తం మీద సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు మెప్పించాయి… ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి…

డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ గోదావరి నేపధ్యం చాలా బాగా సెట్ అవ్వగా కథ సింపుల్ గా ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ది టైం నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకోవడం, కామెడీ సీన్స్ చాలా వరకు వర్కౌట్ అవ్వడంతో వంక పెట్టడానికి ఏమి లేకుండా పోయింది….ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ హాయిగా నవ్వుకుని థియేటర్స్ నుండి బయటికి రావొచ్చు. కథ కొంచం లైట్ గానే ఉండటం, అక్కడక్కడా కొంచం స్లో అవ్వడం తప్పితే…ఆయ్ మూవీ ఆడియన్స్ ను చాలా వరకు మెప్పించడం ఖాయమని చెప్పొచ్చు…ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here