Home న్యూస్ హిట్టు కొట్టి 13 ఏళ్ళు…టీసర్ కుమ్మింది… నారా రోహిత్ కి హిట్టు ఖాయమే!

హిట్టు కొట్టి 13 ఏళ్ళు…టీసర్ కుమ్మింది… నారా రోహిత్ కి హిట్టు ఖాయమే!

0

టాలీవుడ్ లో హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతున్న హీరోలలో నారా రోహిత్(Nara Rohith) ఒకరు…ఆల్ మోస్ట్ 13 ఏళ్ల క్రితం 2011 టైంలో సోలో సినిమాతో సూపర్ హిట్ ని సొంతం చేసుకున్న నారా రోహిత్ టా తర్వాత మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ ని సొంతం చేసుకోలేక పోయాడు, మధ్యలో కొన్ని సినిమాలు పర్వాలేదు అనిపించినా కూడా…

ఎక్కువ శాతం సినిమాలు నిరాశ పరచగా రీసెంట్ గా ఎలక్షన్స్ టైంలో నారా రోహిత్ నటించిన ప్రతినిధి2 సినిమా రిలీజ్ అవ్వగా మొదటి పార్ట్ లా ఏమాత్రం ఇంప్రెస్ చేయలేక పోయింది…ఇక సీరియస్ సబ్జెక్ట్ లను పక్కకు పెట్టేసి ఇప్పుడు ఆడియన్స్ ముందుకు మంచి ఎంటర్ టైనర్ సబ్జెక్ట్ తో…

రావడానికి సిద్ధం అవుతున్న నారా రోహిత్ నటిస్తున్న కొత్త సినిమా సుందరకాండ(SundaraKanda Movie) అంటూ మంచి క్యాచీ టైటిల్ తో వస్తూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా ఈ సినిమాతో నారా రోహిత్ కి కంబ్యాక్ సొంతం అయ్యే అవకాశం ఉందని…

టీసర్ క్వాలిటీ అండ్ కంటెంట్ చూస్తుంటే అనిపిస్తుంది….30 దాటేసినా ఇంకా పెళ్లి కాని మూలా నక్షత్రంలో పుట్టిన హీరో పెళ్లి కోసం పడే పాట్లు, ఈ క్రమంలో ఏ అమ్మాయితో తనకి పెళ్లి సెట్ అయ్యింది ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే అనిపించేలా కట్ చేసిన…

సినిమా టీసర్ మరీ కొత్తదనం ఏమి లేదు కానీ ఉన్నంతలో ఎంటర్ టైనింగ్ గా అనిపించగా టీసర్ క్వాలిటీ కూడా బాగానే ఇంప్రెస్ చేసింది, మొత్తం మీద సినిమా మీద డీసెంట్ అంచనాలు పెరిగేలా చేసిన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు త్వరలో రాబోతూ ఉండగా ఈ సినిమాతో నారా రోహిత్ డీసెంట్ కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here