Home న్యూస్ రికార్డుల వేట మొదలు పెట్టిన గబ్బర్ సింగ్4K….అప్పుడే 1.5 కోట్లు ఔట్ అక్కడా!!

రికార్డుల వేట మొదలు పెట్టిన గబ్బర్ సింగ్4K….అప్పుడే 1.5 కోట్లు ఔట్ అక్కడా!!

0
Gabbar Singh4k Re Release Advance Bookings Report
Gabbar Singh4k Re Release Advance Bookings Report

బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ ల ట్రెండ్ రెండేళ్ళ క్రితం ఓ రేంజ్ లో ఊపెయగా తర్వాత టైంలో రీ రిలీజ్ ల ట్రెండ్ తగ్గిపోగా మళ్ళీ రీసెంట్ గా టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ జోరు అందుకుంటూ ఉండగా మురారి4K సినిమా రీ రిలీజ్ లలో టాలీవుడ్ లో కొత్త రికార్డ్ ను నమోదు చేసింది. తర్వాత ఇంద్ర4K మూవీ సైతం…

టాలీవుడ్ లో సీనియర్ హీరోలలో రికార్డ్ కొట్టగా ఓవర్సీస్ లో ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది. ఇక ఇప్పుడు ఈ రీ రిలీజ్ రికార్డుల వేటలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్(Gabbar Singh4K) మూవీ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు…

కానుకగా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రీ రిలీజ్ కాబోతూ ఉండగా ఈ రీ రిలీజ్ తో అన్ని రికార్డులకు చెక్ పెట్టాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు…సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గా మొదలు అవ్వగా ఓవర్సీస్ లో ఆల్ రెడీ ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో దుమ్ము లేపుతున్న…

గబ్బర్ సింగ్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 1.20 కోట్ల మార్క్ ని దాటేయగా ఇండియాలో 1.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో కూడా ఎక్స్ లెంట్ బుకింగ్స్ ఉండగా వరల్డ్ వైడ్ గా 1.5 కోట్ల రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ సినిమా కి…

ఇప్పటి వరకు జరిగాయి. దాంతో సినిమా ఇలానే ట్రెండ్ ను కొనసాగిస్తే రీ రిలీజ్ లో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను అన్ని చోట్లా సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. రికార్డులు కొట్టాలి అంటే మాత్రం ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఉంది. మరి సినిమా రీ రిలీజ్ లో ఏ రేంజ్ లో సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here